వడదెబ్బతో జాగ్రత్తగా ఉండండి
1 min read
న్యూస్ నేడు హొళగుంద : వడదెబ్బతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హొళగుంద ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ న్యూటన్ అన్నారు. వేసవికాలం కావటంతో ఎండలు విపరీతంగా ఉన్నాయని, ప్రజలు పని ఉంటే తప్ప బయట ఎక్కువగా తిరగరాదని ఆయన సూచించారు. ఎండాకాలంలో అతిగా కూల్ డ్రింకులు తాగటం కన్నా కూడా చల్లని మజ్జిగ, నిమ్మకాయ రసం, కొబ్బరి బోండం లాంటి పానీయాలను మాత్రమే తాగాలని సూచించారు.