కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు
1 min read
జిల్లా అంతటా ఏకకాలంలో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో ప్రత్యేక తనిఖీలు.
ప్రజల భద్రతే లక్ష్యం…. కర్నూల్ డిఎస్పి బాబు ప్రసాద్.
కర్నూలు, న్యూస్ నేడు: ఇటీవల జరుగుతున్న ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య జరుగుతున్న ఉద్రిక్త ల నేపథ్యంలో రాష్ట్ర ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి ఆదేశాల మేరకు జిల్లాల్లో ఈ రోజు సాయంత్రం ముందస్తు జాగ్రత్తల పరంగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.ఈ సంధర్బంగా కర్నూలు జిల్లా ఇంచార్జ్ ఎస్పీ శ్రీ అది రాజ్ సింగ్ రాణా ఐపియస్ పర్యవేక్షణలో ఈ రోజు జిల్లా వ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు తదితర ప్రదేశాలలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్లో పరిధిలలో , సరిహద్దుల్లో, చెక్ పోస్టులలో ఆయా పోలీసులతో పాటు, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ప్రత్యేక పోలీసు బృందాలచే తనిఖీలు చేపట్టారు. జిల్లా అంతటా ఏక కాలంలో తనిఖీలు కొనసాగించారు.అన్ని ముఖ్యమైన ప్రాంతాలలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.కర్నూల్ డిఎస్పి బాబు ప్రసాద్ కర్నూల్ రైల్వే స్టేషన్, కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ లో బాంబు స్క్వాడ్ బృందాలతో తనిఖీలు నిర్వహించారు. మీడియాతో మాట్లాడారు. చీఫ్ ఆఫీస్ ఉత్తర్వుల మేరకు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఇరుదేశాల మధ్య జరుగుతున్న ఉద్రిక్తల నేపథ్యంలో ప్రజల భద్రతే లక్ష్యంగా ముందస్తు జాగ్రత్తలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు.అనుమానితులను విచారిస్తున్నామన్నారు. అనుమానాస్పద వ్యక్తులు గాని , అనుమానాస్పద వస్తువులు గాని, కొత్తగా ఎవరైనా వ్యక్తులు తారసపడితే వెంటనే సంబంధిత పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు.కర్నూల్ డి.ఎస్.పి తో పాటు కర్నూల్ టూ టౌన్ సీఐ నాగరాజరావు ఉన్నారు.
