జోహారపురం కమ్యూనిటీ భవనాల ప్రాంగణంలో ముళ్ళ పొదల తొలగింపు
1 min read
నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు నగరపాలక సంస్థ
కర్నూలు, న్యూస్ నేడు: ఆదివారం జోహారపురం సమీపంలోని ఇందిరమ్మ కాలనీలో ఉన్న కమ్యూనిటీ భవనాల ప్రాంగణంలో ముళ్ళ పొదల తొలగింపు వేగవంతం చేసినట్లు నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు తెలిపారు. ఆదివారం ఆయన కమ్యూనిటీ భవనాల వద్ద జరుగుతున్న జంగిల్ క్లియరెన్స్ పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ కాలనీలో 5 సంవత్సరాల క్రితం వివిధ కులాలకు సంబంధించి 18 కమ్యూనిటీ భవనాలను నిర్మించగా, ప్రస్తుతం అవి నిరుపయోగంగా మారాయన్నారు. దీనిపై ఈ నెల 6న నగరపాలక అధికారులతో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి. భరత్ నిర్వహించిన సమీక్షలో చర్చ జరిగిందని, ఇందిరమ్మ కాలనీ కమ్యూనిటీ భవనాలను ప్రజలు తిరిగి ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారని పేర్కొన్నారు. అందులో భాగంగా ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్ పనులను చేపట్టామని, రెండు రోజుల్లో పనులను పూర్తి చేస్తామని కమిషనర్ వెల్లడించారు.కమిషనర్ వెంట శానిటేషన్ ఇంస్పెక్టర్ హుస్సేన్, శానిటేషన్ మేస్త్రీలు, తదితరులు ఉన్నారు.