NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

​విద్య, వైద్యాభివృద్ధికి కృషి చేయండి

1 min read
  • డా. ఎన్టీఆర్​ హెల్త్​ యూనివర్శిటీ వీసీ కి సూచించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్​ యాదవ్​
  • రాజధానిలో హెల్త్​ యూనివర్శిటీ అనుసంధానంగా మెడికల్​ కాలేజి, హాస్పిటల్​ కు స్థలం కేటాయించాలని మంత్రికి విన్నవించిన వీసీ

విజయవాడ, న్యూస్​ నేడు: రాష్ట్రంలో డా. ఎన్టీఆర్​ హెల్త్​ యూనివర్శిటీ కి సంబంధించి విద్య, వైద్యాభివృద్ధికి విశేష కృషి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా. సత్య కుమార్​ యాదవ్​ యూనివర్శిటీ వైస్​ ఛాన్సలర్​ డా. చంద్ర శేఖర్​ కు సూచించారు. సోమవారం విజయవాడలోని మంత్రి ఛాంబరులో  యూనివర్శిటీ వీసీ డా. చంద్ర శేఖర్​  మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం మంత్రికి పుష్పగుచ్చం ఇచ్చి… శాలువాతో ఘనంగా సన్మానించారు. రాజధాని అమరావతిలో యూనివర్శిటీకి అను సంధానంగా మెడికల్​ కాలేజి, హాస్పిటల్​ ఏర్పాటుకు దాదాపు 40 ఎకరాలు స్థలం కేటాయించాలని మంత్రి ని కోరినట్లు వీసీ . డా. చంద్ర శేఖర్​ తెలిపారు. ఈ విషయమై సీఎం చంద్ర బాబు నాయుడుకు విన్నవించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో  మెడికల్​ విద్యార్థులు, ప్రొఫెసర్లను ప్రోత్సహించి… యూనివర్శిటీ అభివృద్ధికి కృషి చేయాలని, అమరావతిలో  స్థలం కేటాయింపు పై సీఎం చంద్ర బాబు నాయుడు దృష్టికి తాను కూడా తీసుకెళ్తానని  మంత్రి డా. సత్య కుమార్​ యాదవ్​ పేర్కొన్నట్లు వీసీ డా. చంద్ర శేఖర్​ స్పష్టం చేశారు.  అదేవిధంగా చీఫ్​ ప్రిన్సిపల్​ సెక్రటరి కృష్ణ బాబును మర్యాద పూర్వకంగా కలిసి డా. ఎన్టీ ఆర్​ హెల్త్​ యూనివర్శిటీకి సంబంధించిన అభివృద్ధిపై వెల్లడించినట్లు వీసీ డా. చంద్ర శేఖర్​ వెల్లడించారు.  

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *