పెన్నా నదిలో నిలకడగా నీటి ప్రవాహం
1 min readపాత కడప చెరువుకు 100 క్యూసెక్కులు మళ్లింపు
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: ఇటీవల కడప నంద్యాల జిల్లాలోని మోస్తారు భారీ వర్షాలు కురవడంతో కుందూ నది ద్వారా వస్తున్న వర్షపు నీరు పెన్నా నదికి చేరడంతో పెన్నా నదిపై వల్లూరు మండలం ఆది నిమ్మాయిపల్లి ఆనకట్ట వద్ద. చెన్నూరు వద్ద నీటి ప్రవాహం నిలకడగా కొనసాగుతున్నది.600 క్యూసెక్కుల నీరు పెన్నా నది నుంచి చెన్నూరు సిద్ధవటం మీదుగా సోమశిల ప్రాజెక్టులోకి నీరు చేరుతున్నది. ఆదినిమాయపల్లి ఆనకట్ట వద్ద కడప కేసీ కెనాల్ ద్వారా పాత కడప చెరువుకు అలాగే రాచినాయపల్లి చెరువుకు 100 క్యూషకులు నీరు కెనాల్ అధికారులు వదులుతున్నారు. పెన్నా నదిలో ఎంత శాతం ప్రవహిస్తున్నది ఆదినిమ్మాయపల్లి వద్ద కేసీ కెనాల్ అధికారులు. చెన్నూరు కొండపేట పెన్నా నది వంతెన పైనుంచి చెన్నూరు కు చెందిన సెంట్రల్ వాటర్ అధికారులు ఎప్పటికప్పుడు నీటిని పరిశీలిస్తున్నారు.
కడప కేసీ కెనాల్ ఆయకట్టు రైతుల చిగురిస్తున్న ఆశలు!
కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి వరదనీరు తుంగభద్ర. కృష్ణానది కి వరద పోటెత్తాడంతో శ్రీశైలం ప్రాజెక్టు ఎక్కువగ భాగంలో ఉన్న ప్రాజెక్టులు నిండి గేట్లు ఎత్తివేయడంతో వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతుండడంతో నంద్యాల జిల్లా కడప జిల్లా కేసీ కెనాల్ ఆయకట్టు రైతుల ఆశలు చిగురిస్తున్నాయి. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలోకి ఎనిమిది వందల నలభై అడుగులు పైబడి నీరు చేరింది. మరో నాలుగు రోజుల్లో శ్రీశైలం జలాశయంలో పూర్తి నీటిమట్టం చేరేందుకు అవకాశాలు ఉన్నాయి. దీంతో కెనాల్ కింద వరి సాగు చేసే రైతులు ఈసారి కెనాల్ కు నీరు అందుతుంది అన్ని ఆశతో రైతులు ఎదురుచూస్తున్న రు.