నర్సు దేవోభవ….
1 min read
అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు
కర్నూలు, న్యూస్ నేడు: మనకు ఏదైనా యాక్సిడెంట్ జరిగిన కానీ లేక పెరాలిసిస్ లాంటివి వచ్చి ఐసిఐ లో చేరిన కానీ అక్కడ మన వాళ్ళు ఎవరూ ఉండరు.. కానీ మనకు అత్యంత ఆప్తులుగా మనకు సమయానికి కావలసిన అన్ని సేవలు చేసేది అక్కడ ఉన్న నర్సులే.మనకు ఐసీయూలో స్పృహ ఉంటుంది కానీ అన్ని పరికరాలు తగిలించి ఉంటారు.. మనకేం కావాలో మనకు తెలియదు.. ఒకవేళ తెలిసినా కానీ మనం చెప్పలేము.. ఎందుకంటే వెంటిలేటర్ మీద ఉండొచ్చు.. మనకిచ్చే మందులు మనకిచ్చే నీరు, పానియాలు, భోజనం అన్నీ కూడా మనకు చిన్నప్పుడు మన తల్లి తినిపించినట్లు తినిపిస్తూ కంటికి రెప్పలా చూసుకుంటారు.రోజులను స్వస్థత చేకూర్చడంలో డాక్టర్ల పాత్ర ఎంత ఉందో అంతే పాత్ర నర్స్ లకు కూడా ఉంటుంది… వాళ్లు ఎక్కువ బాధ్యతతో పని చేస్తారు వాళ్ళు పని చేసే సమయంలో మీ యొక్క సేవలో మమేకమైపోతారు… మనకు ఎంత డబ్బు ఉన్నా ఎంత ఆస్తి ఉన్నా మనం ఎంత రిచ్ గా ఉన్న కానీ మనము ఆసుపత్రి బెడ్ లో పడినప్పుడు మనలను కంటికి రెప్పలా చూసుకోవాలంటే అది ఒక నర్సుకే సాధ్యం ఇంకెవరికి కాదు.వాళ్ల జీవితాలు పూలపాన్పు కాదు.. వాళ్లు అర కొర జీతాలతోనే జీవితాలను నెట్టుకొస్తూ ఉంటారు.. ఒక 20 సంవత్సరాల నుంచి వాళ్లకు ఎక్కడ కూడా రెగ్యులర్ అపాయింట్మెంట్స్ అంటూ లేవు అన్ని కాంట్రాక్టు పోస్టులే.. ఇక కార్పొరేట్ ఆసుపత్రులలో అయితే ఎక్కువ సమయం పని చేయాలి తక్కువ జీతం ఇస్తారు.అయినా జీతంతో పని లేకుండా వాళ్ళు ఎంతో సంతృప్తిగా ప్రజలకు సేవలు అందిస్తూ ఉంటారు.ఈ ప్రపంచంలో అండర్ రేటెడ్ గా ఉండి దోపిడీకి గురయ్యే వారు ఎవరన్నా ఉండారంటే వాళ్ళు నర్సులే… అధ్యాపక సిబ్బందికి మరియు వైద్య సిబ్బందికి ఎంత ఇచ్చినా కానీ తక్కువే.. అధ్యాపకులు ఒక జాతీయ సంపదగా విద్యాబుద్ధులు పిల్లలకు నేర్పించి మంచి సిటిజన్స్ గా చేస్తారు.. అటువంటి సిటిజన్స్ ఆరోగ్యాన్ని ప్రసాదించే వైద్య సిబ్బంది కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటారు.ఈ నర్సస్ డే రోజు మా గుండె ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స విభాగంలో నర్సెస్ డే ను ఈరోజు జరుపుకోవడం జరిగింది.. ప్రతినిత్యం బైపాస్ చేసిన రోగుల ఆరోగ్యం కోసం తపించే నర్స్ ల మధ్య మేము అంతర్జాతీయ నర్సింగ్ డేని జరుపుకోవడం సంతోషాన్ని ఇచ్చింది.. మా గుండె ఊపిరితిత్తుల చికిత్స విభాగంలోని నర్సింగ్ సిబ్బంది మరియు డాక్టర్లు అంతేకాకుండా ప్రభుత్వ సర్వజన వైద్యశాల నర్సింగ్ సూపర్నెంట్ సావిత్రిబాయి, విమలా దేవి, పద్మమ్మ మరియు మిగతా నర్సింగ్ సిబ్బంది ఇందులో పాల్గొన్నారు.డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి MS MChగుండె మరియు ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులుప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు.