భారతదేశానికి తొలిసారిగా వస్తున్న థామస్ మోర్ యూనివర్సిటీ
1 min readఅంతర్జాతీయ విద్యార్థులకు ఆహ్వానం
పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్ : ప్రఖ్యాత ఉన్నత విద్యా సంస్థ థామస్ మోర్ యూనివర్సిటీ తొలిసారిగా భారతదేశానికి వస్తోంది. ఇక్కడున్న విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్య అవకాశాల కోసం, ఇంకా విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు అందించడానికి ఈ యూనివర్సిటీ ఎంతో ఉత్సాహంగా ఉంది. అంతర్జాతీయంగా అన్ని దేశాలకూ విస్తరించాలని, అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించాలని పెట్టుకున్న తమ లక్ష్యాల సాధనలో భారతదేశ సందర్శన ఒక ముఖ్యమైన మైలురాయి అవుతుంది.థామస్ మోర్ యూనివర్సిటీ ప్రపంచవ్యాప్తంగా విద్యావకాశాలను అందించేందుకు, పెంపొందించడానికి స్మార్ట్ అడ్వెంచర్స్, గెట్2యుని.కామ్‌తో ప్రత్యేకంగా భాగస్వామ్యం కుదుర్చుకుంది. అంతర్జాతీయ విద్యార్థులకు అవకాశాలు, విద్యాపరమైన ఎక్స్‌ఛేంజిలు, పరిశోధన సహకారం, రెండు దేశాల విద్యార్థులు, అధ్యాపకులకు ప్రయోజనం చేకూర్చే ఉమ్మడి కార్యక్రమాలను సులభతరం చేయడమే ఈ భాగస్వామ్యాల లక్ష్యం.ఈ సందర్భంగా స్మార్ట్ అడ్వంచర్స్ ప్రెసిడెంట్ పవన్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, “భారతదేశానికి ఈ అవకాశం తీసుకొచ్చి, థామస్ మోర్ యూనివర్సిటీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. వాళ్ల ఈ పర్యటన భారతీయ విద్యార్థులకు విభిన్న, సంపూర్ణ మార్పును అందించే విద్యానుభావాలను అందించాలన్న మా నిబద్ధతను బలోపేతం చేస్తుంది. ఇంకా భారతదేశం, ఇతర దేశాల విద్యాసంస్థల మధ్య భాగస్వామ్యాలకు తలుపులు తెరుస్తుంది” అని చెప్పారు. థామస్ మోర్ యూనివర్సిటీ వివిధ విభాగాలలో అసాధారణమైన అకడమిక్ ఆఫర్లు, ప్రత్యేక కోర్సులకు ప్రసిద్ది చెందింది. ఇందులో భాగంగా జూలై 24న హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో, 25న విజయవాడలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. ఈ ప్రత్యేక అవకాశం విద్యార్థులు యూనివర్సిటీ ప్రతినిధులతో నేరుగా మాట్లాడేందుకు, అందుబాటులో ఉన్న వివిధ రకాల కోర్సుల గురించి అన్వేషించడానికి వీలు కల్పిస్తుంది. ఈ విశ్వవిద్యాలయం స్టెమ్, డేటా అనలిటిక్స్, ఫైనాన్స్, హెల్త్ కేర్ రంగాల్లో ప్రొఫెషనల్ ఎంబీఏ కోర్సులతో పాటు అనేక రకాల కోర్సులను అందిస్తుంది. ఇంకా.. పబ్లిక్ హెల్త్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ విభాగాల్లో మాస్టర్స్ కోర్సులను అందిస్తున్నారు. అలాగే డేటా సైన్స్‌లో ప్రత్యేకతతో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఇంకా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలను అందిస్తారు.అర్హులైన విద్యార్థులను ప్రోత్సహించడానికి, మద్దతు ఇవ్వడానికి, థామస్ మోర్ యూనివర్సిటీ తమ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను కూడా అందిస్తోంది. అకడమిక్ ఎక్సలెన్స్, నాయకత్వ సామర్థ్యం, ఆయా రంగాల్లో సానుకూల ప్రభావం చూపాలనే నిబద్ధతను గుర్తించడం ఈ స్కాలర్ షిప్ ల లక్ష్యం. విద్యార్థులు రాణించడానికి, వారి లక్ష్యాలను సాధించడానికి సమాన అవకాశాలను అందించాలని యూనివర్సిటీ విశ్వసిస్తుంది.ఈ సందర్భంగా థామస్ మోర్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ జోసెఫ్ చిల్లో మాట్లాడుతూ, “ఈ చారిత్రాత్మక భారత పర్యటనను ప్రారంభించడం, విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలతో అర్థవంతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పర్యటన విద్యార్థులకు సమూల మార్పులతో కూడిన విద్యానుభవాన్ని అందించడం, అంతర్జాతీయంగా నిమగ్నం అయ్యేలా చూడాలన్న మా నిబద్ధతకు నిదర్శనం” అని తెలిపారు. విద్యార్థులు, విద్యా సంస్థలు, విద్యా నిపుణులు అందరూ స్పాట్ అడ్మిషన్ల కోసం నిర్దేశించిన ప్రాంతాలకు సమయానికి చేరుకోవాలని థామస్ మోర్ యూనివర్సిటీ ఆహ్వానిస్తోంది. అక్కడకు వచ్చి, వ్యక్తిగత వృద్ధితో పాటు భాగస్వామ్యాలకు ఉన్న అవకాశాల గురించి తెలుసుకోవాలని కోరుతోంది.