ప్రమాదవశాత్తు ఆటో బోల్తా … యువకుడు మృతి
1 min read
మంత్రాలయం న్యూస్ నేడు: ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడి ఒకరు మృతి చెందిన సంఘటన నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం లో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వెల్డింగ్ వర్క్ చేస్తూ జీవనం సాగిస్తున్న నందవరం మండలం నది కైరవాడి గ్రామానికి చెందిన గొల్ల సూగూరు లక్ష్మన్న కుమారుడు గొల్ల పవన్ (23)ఆటో బోల్తా పడి మృతి చెందడంతో జరిగింది. పవన్ ఎమ్మిగనూరు నుండి ఏపి 21 టివై 7805 నెంబర్ గల షేక్ ఖాసిం కు చెందిన ప్యాసింజర్ ఆటోలో 8 టన్నుల ఇనుప కడ్డీలను వేసుకుని షేక్ ఖాసిం డ్రైవింగ్ చేస్తుండగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్ షాపింగ్ కాంప్లెక్స్ ఎదురుగా ఆటో ఒకవైపుకు వరిగిన నేపథ్యంలో పవన్ ఆటో వాలకుండా పట్టుకునే సమయంలో ఆయన పై ఇనుప కడ్డిలు పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య ముగ్గురు సంతానం ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
