PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వేతన జీవులను నిరాశపర్చిన కేంద్ర బడ్జెట్  : ఏపీటీఎఫ్

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల : పార్లమెంటులో మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖమంత్రి శ్రీమతి. నిర్మలాసీతారామన్  ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ వేతన జీవులనునిరాశపరిచిందని ఏపీటీఎఫ్ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి నగిరి శ్రీనివాసులు జిల్లా కార్యదర్శులు మానపాటి రవి, ఆవుల మునిస్వామి, విమర్శించారు. మంగళవారం గడిగరేవులలో జరిగిన ఏపీటీఎఫ్ సమావేశంలో వారు మాట్లాడుతూ పాత పన్నుల విధానంలో ఏలాంటి మార్పు చేయకుండా, కొత్త పన్నుల విధానంలో మాత్రమే మార్పులు చేయడం వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎలాంటి ప్రయోజనం లేదని వారన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆదాయపన్నుకు సంబంధించి పాత విధానం కంటే కొత్త విధానంలో పన్ను ఎక్కువగా చెల్లించాల్సి రావడంతో ఉద్యోగులు పాత విధానానికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని వారన్నారు. ఈసారైనా పాత విధానములో పన్నులు చెల్లించే వారికి రాయితీ ఇస్తారని ఆశించారని అయితే మంగళవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ వారికి నిరాశను కలిగించి, మరోసారి కొత్త పన్నుల విధానానికే రాయితీలు ప్రకటించడం పట్ల ఏపీటీఎఫ్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా పాత పెన్షన్ విధానంను పునరుద్ధరించాలని ఉపాధ్యాయ, ఉద్యోగులు ఆందోళనలు చేస్తుంటే బడ్జెట్ లో పాత పెన్షన్ ప్రస్తావన లేకపోవడం చాలా బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మధ్యతరగతి ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, పాత పన్నుల విధానంలో 7 లక్షల వరకు ఎలాంటి పన్ను లేకుండా మినహాయింపు ఇచ్చి పన్నుల స్లాబ్ విధానాన్ని సవరించాలని, కనీసం లక్ష రూపాయలు స్టాండర్డ్ డిడెక్షన్ మినహాయింపు ఉండాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో ఏపీటీఎఫ్ గడివేముల మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం. ప్రతాపరెడ్డి, ఎల్. బాలస్వామి, జిల్లా మహిళా కార్యదర్శి యు. కవిత సీనియర్ నాయకులు ఎ. నాగన్న, ఎస్. మహబూబ్ బాషా, బి. రాంపుల్లారెడ్డి, ఎమ్. మారెన్న, జి. శ్రీరాములు, చంద్రశేఖర్ ఆచారి, జి. వెంకటేశ్వర్లు,ఎస్. శ్రీనివాసులు, ఎస్. బాలవెంకటేశ్వర్లు, టి. లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

About Author