ఈనెల 17నుండి విద్యార్థులకు పినాక ఉచిత శిక్షణ తరగతులు
1 min read
రాయలసీమ రవికుమార్.కోర్స్ డైరెక్టర్,పినాక.
రాష్ట్ర అధ్యక్షులు…రాయలసీమ విద్యార్థి పోరాట సమితి.
కర్నూలు, న్యూస్ నేడు : పినాక ప్రజా సాధికార ట్రస్టు మరియు హైదరాబాద్ ఇన్కమ్ టాక్స్ అడిషనల్ కమిషనర్ బి.యాదగిరి, అమిలియో హాస్పిటల్ అధినేత డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని శ్రీలక్ష్మీ హైస్కూల్ లో ఈ నెల 17నుండి మొదలయ్యే స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటర్వ్యూ స్కిల్స్ ఉచిత శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని పినాక కోర్స్ డైరెక్టర్, రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్ కోరారు.కర్నూలు నగరంలోని స్థానిక సీక్యాంపులో గల టీజీవి కళాక్షేత్రంలో పినాక ఉచిత శిక్షణ తరగతుల కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అమిలియో హాస్పిటల్ అధినేత డాక్టర్ లక్ష్మీ ప్రసాద్, రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్ పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా కర్నూలు నగరంలో పినాక ప్రజా సాధికార ట్రస్టు ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటర్వ్యూ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, గ్రూప్స్, సివిల్స్ గైడెన్స్ కోర్సును ఈ సంవత్సరం కర్నూలు నగరంలోని మున్సిపల్ ఆఫీస్ వద్ద ఎన్,ఆర్ పేటలో గల శ్రీలక్ష్మీ హైస్కూల్ లో నిర్వహిస్తున్నామని విద్యార్ధులకు ఉచితంగా కోర్సుతో పాటు ఉచితంగా కోర్స్ మెటీరియల్, మధ్యాహ్నం ఉచిత భోజన సదుపాయం, అమ్మాయిలకు ఉచిత హాస్టల్ వసతి ఏర్పాటు చేసామని అడ్మీషన్ల కోసం కోర్స్ డైరెక్టర్ రాయలసీమ రవికుమార్ సెల్:9177764147,9640969891 నెంబర్లను సంప్రదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కురువ,మదాసి/మదారి కురువ సంఘాల నాయకులు కె.రామకృష్ణ,ఈశ్వరయ్య,కె.సి నాగన్న, డాక్టర్ మద్దిలేటి,పాల సుంకన్న,ఎల్లప్ప, మహేంద్ర,కురువలాలు,కల్లూరు శివ,కురువ రమణ,శివనారాయణ,పిట్టల మహేష్, తదితరులు పాల్గొన్నారు.