PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఓ పల్లెటూరి ప్రేమకథ

1 min read

సినిమా డెస్క్​ : పోయినేడు ఓటీటీలో రిలీజయిన కృష్ణ అండ్‌ హిజ్‌ లీల, మా వింత గాధ వినుమా ఈ రెండు సినిమాలతో సిద్ధు జొన్నలగడ్డ పాపులర్‌‌ హీరో అయిపోయాడు. తను నటిస్తున్న మరో కొత్త చిత్రం నిన్న ప్రారంభమైంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. శౌరి చంద్రశేఖర్ టి.రమేష్ నూతన దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. త్రివిక్రమ్ ముఖ్యఅతిథిగా హాజరై ముహూర్తపు షాట్ కి క్లాప్ కొట్టారు. నిర్మాత రాధాకృష్ణ తన చేతుల మీదుగా స్క్రిప్ట్ ని దర్శకుడికి అందజేశారు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే లవ్ స్టోరీ ఇదని, ఆగస్టు నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్టు దర్శకుడు చెప్పాడు. తమిళ నటుడు అర్జున్ దాస్ కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. స్వీకార్ అగస్తి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇతర నటీనటుల వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు.

About Author