నేటి నుంచి చెన్నూరులో ఎల్లమాంబ అమ్మవారు జాతర మహోత్సవాలు
1 min read
ఇంటికి వెళ్ళనన్న పోతులూరి అయ్య స్వామి
చెన్నూరు, న్యూస్ నేడు: చెన్నూరుకు కిలోమీటర్ దూరంలో కె.విఓఆర్ కాలనీలో వెలసిన ఎల్లమాంబ అమ్మవారు జాతర మహోత్సవాలు నిర్వహించేందుకు ఆలయ కమిటీ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం ఎల్లమాంబ అమ్మవారు సోదరుడు పోతులూరి అయ్య స్వామి ఉత్సవ విగ్రహాన్ని చెన్నూరు పురవీధుల గుండా డప్పు వాయిద్యాలతో నిర్వాహకులు ప్రతి ఇంటికి వెళ్లి ఎల్లమాంబకు బియ్యము బేడలు పసుపు కుంకుమలను సేకరిస్తారు. రెండు రోజులపాటు ప్రతి ఇంటి నుంచి సేకరించిన బియ్యము బేడలు పసుపు కుంకుమలను పోతులూరయ్య స్వామిని స్థానిక బ్రాహ్మణ వీధిలో ఉన్న ఆంజనేయస్వామి గుడి దగ్గర నుంచి తప్పెట్ల మధ్య కర్ర సాగు చేసుకుంటూ వివిధరకాల విన్యాసాలు. రంగులు వెదజల్లుకుంటూ మధ్యాహ్నం రెండు గంటలకు ఊరేగింపు ప్రారంభమవుతుంది. ఈఊరేగింపులో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు దుకాణాలను మూసేస్తారు. ఈ ఊరేగింపు పార్కు వీధి. బస్టాండ్. రెవిన్యూ కార్యాలయం. పోలీస్ స్టేషన్ మీదుగా ఎల్లమాంబ ఆలయం వరకు కొనసాగుతుంది. ఒక ప్రార్థన మందిరం దగ్గరకు వచ్చేసరికి ఉద్రిక్తతల మధ్య జరిగే ఈ ఊరేగింపులో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు విస్తృత బందోబస్తు నిర్వహిస్తున్నారు. డీఎస్పీ. సీఐలు. ఎస్సైలు. హెడ్ కానిస్టేబుళ్లు. ఏ ఆర్. సిఐడి. విజిలెన్స్. సివిల్ పోలీసులను బంధవస్తు కు నిర్వహించనున్నారు. ఈ మేరకు చెన్నూరు సిఐ కృష్ణారెడ్డి గ్రామంలో ఉన్న ఇరువర్గాల గ్రామ పెద్దలతో చర్చించడం జరిగింది. అవాంఛనీయ సంఘటనలు పాల్పడితే ఇరువర్గాల గ్రామ పెద్దలదే బాధ్యత అని ఆయన హెచ్చరించారు. జాతర ప్రశాంతతకు అందరూ సహకరించాలని కోరారు.