మిడుతూర్ ఎంఈఓ గా రామిరెడ్డి..
1 min read
మిడుతూరు, న్యూస నేడు: (నందికొట్కూరు):నంద్యాల జిల్లా మిడుతూరు మండల విద్యాశాఖ అధికారి-1 రామి రెడ్డిని ఎఫ్ఏసీగా అధికారులు నియమించారు.ఈయన గురువారం బాధ్యతలు చేపట్టారు.వచ్చేనెల జూన్ 3వ తేదీ వరకు ఇన్చార్జిగా ఉంటారు.ఇంతవరకు ఎంఈఓ గా ఉన్న ఫైజున్నిసా బేగం గత నెల 24వ తేదీ నుండి సెలవులో ఉన్నందున ఆ స్థానంలో నందికొట్కూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల (గాంధీ మెమోరియల్) హెచ్ఎం ను నియమిస్తూ కడప రీజినల్ జాయింట్ డైరెక్టర్ కే.సామేల్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి హృదయ రాజు గురువారం తెలిపారు.ఈయన గతంలో మిడుతూరు ఎంఈఓ గా పని చేశారు.ఈ ఉత్తర్వులు జారీ చేయుటకు కృషి చేసిన రాష్ట్ర అధ్యక్షులు హృదయ రాజు,కడప ఆర్జేడీ,నంద్యాల డీఈఓ జనార్ధన్ రెడ్డి లకు జిల్లా ఉపాధ్యక్షులు సుంకన్న, మండల అధ్యక్ష,కార్యదర్శులు శేషయ్య,మల్లికార్జున మండల ఉపాధ్యాయ బృందం ధన్యవాదములు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.దీంతో ఈ నెల జీతం బిల్లులు చేయుటకు సమస్య లేకుండా పోయిందని మరియు ఇతర పాలనాపరమైన సమస్యలు లేకుండా పోయాయని వారు తెలిపారు.