ప్రముఖ న్యాయవాది ఈరన్న మృతి…
1 min read
ఈరన్న మృతికి సంతాపం తెలిపిన ప్రముఖులు
కర్నూలు,న్యూస్ నేడు: సీనియర్ న్యాయవాది వడ్ల ఈరన్న 62 సం.లు గురువారం ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మృతి పట్ల పట్టణ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ప్రముఖ న్యాయవాది ఈరన్న వృత్తి పట్ల అంకితభావంతో కక్షిదారుల యోగక్షేమాలను ఆశించి ఎన్నో క్లిష్టతరమైన కేసులను పరిష్కరించగలిగారు. గత 25 సంవత్సరాలుగా న్యాయవాద వృత్తిలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని సుదీర్ఘ అనుభవం సాధించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు మధుబాబు, సీనియర్ న్యాయవాదులు మైరాముడు బి రంగస్వామి, కృష్ణయ్య, దామోదరాచారి, శ్రీనివాస్ రెడ్డి, నాగేష్, నారాయణస్వామి, మహేష్ తదితరులు పార్థివ దేహాన్ని సందర్శించి ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. మృతునికి ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారు.