ఏపీ ఉద్యోగుల సంఘం నుంచి అధ్యక్షుడిగా కె. ఆర్ ని బహిష్కరించాం
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నుంచి కె.ఆర్ సూర్యనారాయణ ను బహిష్కరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆస్కార్‌రావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లోశనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేఆర్ సూర్యనారాయణ తమ అసోసియేషన్ లో నిబంధనలు ఉల్లంఘించి 26 జిల్లాల అధ్యక్ష, కార్యదర్సులు చేశారని మండిపడ్డారు. ఇప్పుడు 26 జిల్లాలని 13 జిల్లాలుగా కుదించామని తెలియజేశారు. గత ప్రభుత్వంతో మంతనాలు జరిపి తమ అసోసియేషన్ ను సంప్రదించకుండా పిఆర్సి తక్కువకి మాట్లాడారని తెలిపారు. అలాగే ఉద్యోగస్తుల మీద తన అనుచరులతో అక్రమ కేసులు బనాయించారని, మహిళా ఉద్యోగస్తులను వేధింపులుకు గురి చేశారని ఆరోపించారు. అందువల్ల కె.ఆర్ ని తమ సంఘం నుంచి బహిష్కరించామని తెలియజేశారు.సంఘం కొత్త అధ్యక్షుడిగా డి.శ్రీకాంత్‌ను నియమిస్తున్నామని పేర్కొన్నారు. గుల్ల నాగ సాయిని కూడా సంఘము నుంచి బహిష్కరిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలోసంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.