ఇంటి స్థలం ఇచ్చి,ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్
1 min read
సిపిఐ ఏలూరు ఏరియా కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్
19వ తేదీ మండల తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తాం
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో ఇల్లు లేని పేద ప్రజలకు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు,గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని,ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ గత కొద్ది నెలలుగా ప్రజల నుండి దశలవారీగా అర్జీలు నమోదు చేయించి మొదటి దశలో గ్రామ, వార్డు సచివాలయాల్లో రెండవ దశలో జిల్లా కలెక్టర్ కు అందించుట జరిగినది. ఇప్పుడు అర్జీలను పరిశీలించి తక్షణమే అర్హులైన పేదవారికి ఇళ్ల స్థలాలు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 19వ తేదీ సోమవారం ఉదయం 11.00 గంటలకు ఏలూరు మండల తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించి, తహశీల్దార్ కు వినతి పత్రం అందించే కార్యక్రమం జరుగుచున్నదని సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమంలో సొంత ఇల్లు,ఇంటి స్థలం లేకుండా అద్దె ఇళ్లల్లో నివసిస్తున్న ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.