పచ్చదనంతోనే- పర్యావరణం సాధ్యం
1 min read
పరిశుభ్రతతోనే- సంపూర్ణమైన ఆరోగ్యం
కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎమ్మెల్యే పుత్తాకృష్ణ చైతన్య రెడ్డి
చెన్నూరు , న్యూస నేడు: పచ్చదనంతోనే పర్యావరణం సాధ్యపడుతుందని పల్లె ప్రజలు పరిశుభ్రతను పాటించినట్లయితే ఆరోగ్యవంతమైన గ్రామాలుగా వర్ధిల్లుతాయని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, కమలాపురం శాసనసభ్యులు పుత్తా కృష్ణ చైతన్య రెడ్డిలు అన్నారు. శనివారం ఉదయం స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర లోభాగంగా స్థానిక గ్రామపంచాయతీ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ, గ్రామంలోని ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతాయుతంగా పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత పాటించాలని తెలిపారు. ఇళ్లల్లోని వ్యక్తపదార్థాలు, చెత్తాచెదారం ఎక్కడపడితే అక్కడ రోడ్లపై వేయరాదని తెలిపారు. గ్రామపంచాయతీ ద్వారా వచ్చే ట్రై సైకిళ్ల లో వచ్చే హరిత రాయబారులకు తడి చెత్త ,పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని తెలిపారు. తమ ఇళ్ల వద్ద నీటిని వృధా కానివ్వకుండా, రోడ్లమీదకు వెళ్లకుండా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. దీనికోసం ప్రభుత్వం నిధులను కేటాయించడం జరిగిందన్నారు. ప్రజలకు ఆరోగ్యంపై, పచ్చదనంపై, పరిశుభ్రతపై అవగాహనలో భాగంగా ప్రత్యేకంగా ప్రతి శనివారం స్వర్ణ ఆంధ్ర- వచ్చే ఆంధ్ర కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. తద్వారా గ్రామాలలో హరిత విప్లవం, ఆరోగ్యం ,పరిశుభ్రత పై ప్రజల్లో ఒకింత స్పందన రావడం జరిగిందన్నారు. ఇది ఇంకా మెరుగుపడేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని వారు తెలియజేశారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ప్రతి నెల మూడవ శనివారం ఈ కార్యక్రమాలను నిర్వహించేందుకు రూప కల్పన చేయడం జరిగిందన్నారు. వేసవిలో మండుటెండలు ఉండడం చేత ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని బయటికి వెళ్లేటప్పుడు వేడిని తట్టుకునే విధంగా నెత్తిపై టోపీలు పెట్టుకోవాలని, తడి గుడ్డలు నెత్తిపై వేసుకోవాలని, అలాగే ఎక్కువ శాతం నీరు తీసుకోవాలని వారు తెలియజేశారు. గ్రామాలలోని ప్రజా ప్రతినిధులు, ఎక్కడికక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తికి వెసులుబాటు కల్పించాలని తెలిపారు. గ్రామాలలో ప్రతి ఇంటి వద్ద మొక్కలు నాటాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. మొక్కల ద్వారా పచ్చదనంతో పాటు పర్యావరణం కూడా బాగుంటుందని వీటి ద్వారా ప్రజల ఆరోగ్యం కూడా బాగుంటుందని వారు తెలిపారు. ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలను గురించి, అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలైన కూలర్లు, పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులు ఉండడం ద్వారా అక్కడ నీరు ఏర్పడి అక్కడ దోమలు వ్యాప్తి చెందుతాయని వీటివల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు ఏర్పడడమే కాకుండా, రకరకాల రోగాలు ఏర్పడతాయని వాటిని వెంటనే తొలగించాలని వారు తెలిపారు. అతివృష్టి అనావృష్టి ఉండాలంటే కచ్చితంగా పర్యావరణాన్ని కాపాడాలని ప్రజలు చెట్లను నాటాలని వారు తెలిపారు, చెన్నూరు గ్రామపంచాయతీ ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దేందుకు నాయకులు, అధికారులు, ప్రజల సహకారం ఎంతో అవసరమని దీనికి ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలియజేశారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రవేశ పెట్టిన సూర్య దార్ పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఈ పథకం ద్వారా 50% శాతం రాయితీతో ప్రభుత్వాలు సోలార్ ఏర్పాటు చేయడం జరుగుతుందని వారు తెలియజేశారు. సోలార్ ఏర్పాటు చేయడం ద్వారా కరెంటు కష్టాలు, తగ్గుతాయని వారు తెలియజేశారు. గ్రామపంచాయతీ ఆవరణలో మొక్కలు నాటి వారు నీరు పోయడం జరిగింది. అనంతరం స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర నినాదంతో గ్రామపంచాయతీ నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టి పాత బస్టాండ్ నందు మానవహారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్, డిపిఓ రాజ్యలక్ష్మి, డి ఎం హెచ్ ఓ నాగరాజు, ఆర్డిఓ జాన్ యర్విన్, డి ఆర్ డి ఎ పి డి రాజ్యలక్ష్మి, జడ్పీ సీఈవో ఓబులమ్మ, సర్పంచ్ సిద్ది వెంకటసుబ్బయ్య, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, ఏడుకొండలు, తాసిల్దార్ సరస్వతి, ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు, ఏపీవో శైలజ, వెంకటేష్, తో పాటు సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడి కార్యకర్తలు, మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.