నగరంలోని స్థానిక సమస్యలపై పోరాటం ..సిపిఐ
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నగర సమితి శాఖా కార్యదర్శుల సమావేశం స్థానిక సిపిఐ కార్యాలయం నందు జరిగింది ఈ సమావేశానికి సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు నాగరాజు అధ్యక్షాత వహించగా సమావేశం కి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్కే జగన్నాథం మరియు నగర కార్యదర్శి పి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కర్నూలు నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 52 వార్డులలో ప్రజల సమస్యలపై పోరాటం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో చేయాలని నగరంలోని ట్రాఫిక్ సమస్యలపై అధికారులు పోలీసు వారు దృష్టి పెట్టి ప్రజలకు అసౌకర్యంగా లేకుండా చూడాలని కర్నూల్ నగరంలో కుక్కల బెడద ఎక్కువగా ఉండటం వల్ల అనేకమంది చిన్నపిల్లల మొదలుకొని పెద్దవారి వరకు కుక్క కాటుకు గురవుతున్నారని తక్షణమే వాటి నుండి నగర ప్రజలను కాపాడాలని డ్రైనేజీ రోడ్లు మంచినీటి సమస్యలను పరిష్కారం కోసం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు పెద్ద ఎత్తున చేపట్టాలని కర్నూలు నగర శివారా ప్రాంతాలలో రెండు రోజులు మరియు మూడు రోజులకు మంచినీళ్లు వస్తున్నాయని కావున మున్సిపల్ అధికారులు తక్షణమే సమస్యపై దృష్టి సారించే విధంగా పోరాటం చేయాలని వారి సందర్భంగా శాఖ కార్యదర్శిలకు పిలుపునిచ్చారువార్డులలో పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అలాగే ఫాగింగ్ హైపోద్రవం కార్యక్రమాన్ని చేపట్టే మలేరియా సెక్షన్ అధికారులు సీజనల్ వ్యాధులు రాకుండా అరికట్టే దాంట్లో భాగంగా తక్షణమే చర్యలు తీసుకునే విధంగా మున్సిపల్ అధికారులపై ఒత్తిడి తేవాలని వారు తెలిపారు ఈ సమావేశంలో
సిపిఐ నగర సహాయ కార్యదర్శులు
డి శ్రీనివాసరావు
సి మహేష్ కార్యవర్గ సభ్యులు గిద్దమ్మ ఈశ్వర్ అన్వర్ కుమార్ నల్లన్న బీసన్న శాఖా కార్యదర్శులు రామాంజనేయ గౌడ్ నీలకంఠ కుమారు బాబయ్య సులోచనమ్మ సత్యం కుమార్ రాజా రంగన్న భువన కుమార్ కాజా ముని కరి ముని నాగరత్నమ్మ బీసమ్మ కన్నమ్మ వెంకటేశ్వరమ్మ లక్ష్మీదేవి కృష్ణ నాగరాజు శైలజ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.