శ్రీ కనకదుర్గ అమ్మవార్లకు సారె,చీర సమర్పణ
1 min readవివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు రాక
పండుగ వాతావరణాన్ని తలపించిన వైఎస్ఆర్ గ్రామం
ప్రతి ఏటా ఆషాడంలో సందడే సందడే
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : స్థానిక తూర్పు లాకులు వైయస్సార్ కాలనీ గ్రామంలో ప్రతి ఆషాడ మాసంలో గత కొన్ని సంవత్సరాల నుండి గ్రామంలో పండుగను తలపించేలా సందడి నెలకొంటుంది. అదేవిధంగా ఈ ఏడాది ఆదివారం గ్రామంలో అమ్మవార్లకు మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు నడుమ వేంచేసియున్న శ్రీకనకదుర్గమ్మ అమ్మవార్లకు గ్రామంలో ఆలయ వ్యవస్థాపకులు బ్రహ్మం ఆధ్వర్యంలో మహిళలంతా కలిసి పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవార్లకు సరే,పసుపు, కుంకుమ, సున్నిపిండి, పూలు, పండ్లు,గాజులు, చలిమిడి, నూతన వస్త్రాలతో పాటు వివిధ రకాల స్వీట్లు, పరిమళ ద్రవాలుతో అలంకార సామాగ్రిని సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకులు చే అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుండి బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు,భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవార్లకు నైవేద్యాలు సమర్పించి మ్రొక్కులు తీర్చుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. చుట్టుపక్కల నివాస ప్రాంతాల భక్తులరాకతో ఆలయాలు పండుగ వాతావరణాన్ని తలపించి పిల్లాపాపలతో సందడి నెలకొంది. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలవకుండా పెద్దలు, నిర్వాహకులు పర్యవేక్షించారు.