జంగాలి కాలనీలో విద్యుత్ తీగల సమస్యను పరిష్కరిస్తాం
1 min read
టీడీపీ యువ నాయకుడు గిరిమల్లేశ్ గౌడ
హొళగుంద న్యూస్ నేడు : జంగాలి కాలనీలో సందర్శించిన గిరిమల్లే హొళగుందలోని జంగాలి కాలనిలో ప్రధాన విద్యుత్ తీగల సమస్యను పరిష్కరిస్తామని టీడీపీ యువనాయకుడు గిరిమల్లేశ్ గౌడ అన్నారు. ఆదివారం కాలనిని సందర్శించి న ఆయన సమస్యను తెలుసుకున్నారు. విద్యుత్ సబ్ స్టేషన్ పక్కన ఉన్న మా కాలనిలో విద్యుత్ తీగల వల్లా ప్రమాదం ఏర్పడుతుందని, తీగలు తెగిపడుతున్నాయని ఈ సమస్యను విద్యుత్ శాఖామంత్రి గట్టు రవికుమార్ దృష్టికి తీసుకెళ్ళామని టీడీపీ నాయకుడు జంగాలి రామాంజనేయులు చెప్పారు. సమస్యను ఒక ఫైల్గా తయారు చేసి మంత్రికి అందజేశామన్నారు. విద్యుత్ శాఖాధికారులకు చెప్పి సమ స్యను పరిష్కరిస్తామని మంత్రి చెప్పినా ఇంత వరకు సమస్య పరి ష్కరం కాలేదన్నారు. ప్రధామైన సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరడంతో కాలనిని సందర్శించిన గిరిమల్లేశొగౌడ వెంటనే మా తండ్రి ఇన్చార్జీ వీరభద్రగౌడకు చెప్పి మంత్రితో సంప్రదించి విద్యుత్ తీగల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు బసవ, ముళ్ళ మోయిన్, లక్ష్మన్న పాల్గొన్నారు.