వర్షంలో పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు ఎమ్మెల్యే 15 వేలు సహాయం
1 min read
ఎమ్మిగనూరు, న్యూస్ నేడు: ఎమ్మిగనూరు పట్టణంలో వర్షంలో పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు తక్షణ సహాయంగా 15000 రూపాయలు పంపిణీ చేసిన శాసనసభ సభ్యులు శ్రీ బి వి. జయ నాగేశ్వర్ రెడ్డి : మాచారి సోమప్ప నగర్ రేకుల షెడ్డు నందు నివాసముంటున్న కురువ శ్రీరాములు కుటుంబం లోని ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడి మెరుగైన వైద్యం కోసం కర్నూలు పంపడం అందరికీ విధితమే. శాసనసభ్యులు శ్రీ జయ నాగేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు కాబోయే మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య మరియు పట్టణ అధ్యక్షులు నవాజ్ సమక్షంలో బాధితులను పరామర్శించి కనీస అవసరాలకు 15000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కుటుంబ పెద్ద శ్రీరాములు మాట్లాడుతూ మేము 13 మంది ఉమ్మడిగా కలిసి రేకుల షెడ్డునందు దాదాపు పది సంవత్సరాల నుంచి నివసిస్తున్నాం అయితే అనుకోని సంఘటన వల్ల వర్షం కురుస్తున్న సందర్భంలో బిల్డింగ్ పక్కన ఉన్న మూడంతస్తుల బిల్డింగ్ పైనుంచి ఇటుకలు పడడం ద్వారా తన కుటుంబం రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేశారు గాయపడిన కుటుంబ సభ్యులను ఆదుకోవాలని అదేవిధంగా ఇంటి నిర్మాణం చేపట్టాలని ధ్వంసమైనటువంటి చెడును పునర్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు పాల్గొన్నారు.