వివాహ కార్యక్రమాలకు హాజరైన శశికళ కృష్ణమోహన్
1 min read
హొళగుంద , న్యూస్ నేడు: ఆదోని తాలూకా పెద్దహరివాణం గ్రామంలో పోలీస్ సునిల్ కుమార్ వివాహ కార్యక్రమానికి మరియు ఆలూరు తాలూకా దేవనకొండ మండలం కరివేముల గ్రామంలో దినేష్ రెడ్డి కుమారుడు వివాహ కార్యక్రమానికి మరియు అస్పరి మండలం తురవగల్లు గ్రామం లక్షిరెడ్డి కుమారుడు వివాహ కార్యక్రమానికి మరియుహొళగుంద మండల కేంద్రంలో మురళీ కుమారుడు వివాహ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరైన కర్నూలు జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి శశికళ కృష్ణమోహన్ నూతన వధూవరులను ఆశీర్వదించి, హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు, జడ్పిటిసి, కన్వీనర్, ఎంపీపీ, కో కన్వీనర్, సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, శశికళ కృష్ణమోహన్ అభిమానులు, పాల్గొన్నారు.
