డోన్ పట్టణంలో మహానాడు ఘన విజయం
1 min read
ప్యాపిలీ, న్యూస్ నేడు: తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు, డోన్ నియోజకవర్గ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్న ఎమ్మెల్యే జయ సూర్యప్రకాశ్ రెడ్డి మార్గదర్శనంలో, ప్రజాదరణ పొందిన మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ నేతృత్వంలో,డోన్ పట్టణంలోని సాయి ఫంక్షన్ హాల్ వేదికగా మహానాడు కార్యక్రమం అత్యంత వైభవంగా, ఉత్సాహభరితంగా నిర్వహించారు.పార్టీ జెండా ఆవిష్కరణతో ప్రారంభమైన ఈ సభ, నందమూరి తారకరామారావు చిత్రపటానికి పూలమాలలు సమర్పించి,ఆపరేషన్ సింధూరులో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు ఘన నివాళులర్పించారు.అనంతరం ఈ మహానాడు సభలో నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి భారీగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ముఖ్య నాయకులు నియోజకవర్గ అభివృద్ధిపై చేసిన కృషిని ప్రజలముందు ఉంచారు. భవిష్యత్ కార్యాచరణపై విశ్లేషణ జరిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ మాట్లాడుతూ ఈ సభ మాకు ఒక శక్తి పంపిణీ కేంద్రంగా మారింది.మా ధ్యేయం,ప్రజలతో ఉండటం. మీరు ఇచ్చే మద్దతే మా బలమవుతుంది.” ప్రతి కార్యకర్త చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు“డోన్ నియోజకవర్గం అభివృద్ధి, యువత భవిష్యత్, వ్యవసాయాన్ని బలోపేతం చేయడం – ఇవే మా లక్ష్యాలు. కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి పనిచేస్తోంది. మహానాడు ద్వారా పార్టీ కార్యకర్తల్లో ఉన్న స్పూర్తి కనిపించింది. ప్రతి కుటుంబం కలిసికట్టుగా ఉండాలంటే, మంచి పాలన అవసరం.మీ ఆశీస్సులతో డోన్ ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాం,” అని తెలిపారు.ఈ మహానాడు కార్యక్రమంలో డోన్ నియోజకవర్గానికి చెందిన ప్రతి మండలానికి మరియు గ్రామానికి చెందిన కార్యకర్తలు, పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేశారు.
