స్నేహితుని కుటుంబానికి 20 వేల ఆర్థిక సహాయం..
1 min read
నందికొట్కూరు, న్యూస్ నేడు: చిన్ననాటి తనంలో ఒకే పాఠశాలలో చదువుకున్నారు. కానీ అనారోగ్యం రీత్యా స్నేహితుడు మరణించడంతో ఆ కుటుంబానికి బాసటగా నిలిచారు చిన్ననాటి స్నేహితులు..వివరాల్లోకి వెళ్తేనంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని వడ్డేమాను గ్రామానికి చెందిన సగినాల స్వాములు అనారోగ్యంతో 2024 నవంబర్ లో మరణించారు.ఈయనకు నలుగురు కుమార్తెలు ఈయన పెద్ద కుమార్తె అయిన స్వప్న ప్రియకు ఈనెల 22న వివాహం జరుగుతోంది.ఇది తెలుసుకున్న స్నేహితులు నందికొట్కూరు నవనంది పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు సగినాల సుబ్బన్న మరియు ఆర్టీసీ నాగేంద్ర,గాదె దాస్,పబ్బతి రమేష్,సురేష్,సతీష్ కలిసి కుటుంబానికి 20 వేల రూపాయల నగదును ఆదివారం నూతన వధువు మరియు తల్లికి ఆర్థిక సహాయాన్ని అందించి గొప్ప మనసును చాటుకున్నారు. సహాయం చేసినందుకు గాను కుటుంబ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీఎస్ఐ సంఘం పాస్టర్ కిరణ్ బాబు మరియు సంఘస్తులు పాల్గొన్నారు.