సోలార్ లో యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి..
1 min read
పైపాలెంలో గ్రామస్తులతో సమావేశమైన:ఏపీ రైతు సంఘం
మిడుతూరు (నందికొట్కూరు ) న్యూస్ నేడు : గ్రీన్ కో సోలార్ కంపెనీలో చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కే ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని పైపాలెం గ్రామంలో సాయంత్రం ప్రభాకర్ రెడ్డితో పాటు జిల్లా కార్యదర్శి రాజశేఖర్ గ్రామస్తులతో సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రీన్ కో సోలార్ కంపెనీ మా గ్రామంలో సభ జరపకుండా ప్రజల ఆమోదం లేకుండానే సోలార్ పనులు ప్రారంభించారని ప్రారంభించిన తర్వాత మా భూములకు వెళ్లేందుకు ఉన్న రస్థలను ఆక్రమించారని,మా పొలాల చుట్టూ ఉన్న రాళ్లకతులను తొలగిస్తున్నారని పశువులకు, గొర్లకు,మేకలకు జీవనాధారం ఉన్న కొండ ప్రాంతాన్ని ఆక్రమించడం, పశువులకు నీళ్లు తాగే చెరువులను, కుంటలను పూడ్చివేశారని వీటి మూలంగా మా గ్రామంలో జీవనోపాధి కోల్పోవడం జరిగిందని రైతుల భూములకు తీవ్రంగా నష్టం చేస్తున్నారని వాపోయారు.ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా గ్రామ ప్రజలందరూ కలిసి ఐక్యంగా పోరాడాలని అందుకు రైతు సంఘం అండగా ఉంటుందని అన్నారు.2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయకుండా గ్రీన్కో సోలార్ కంపెనీ వాళ్ళు రాజకీయ అండదండతో రైతులను బెదిరించి భూములను లాక్కుంటున్నారని వారు ఆరోపించారు.గ్రామాల్లో చదువుకున్న యువతకు సోలార్ ప్రాజెక్టులో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. రైతుల అనుభవంలో ఉన్న ప్రభుత్వ భూములకు రైతులకు పట్టాలు ఇవ్వాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు నాగేశ్వరరావు, సిఐటియు నాయకులు గోపాలకృష్ణ,ఉస్మాన్,ఓబులేష్ మరియు గ్రామస్తులు పుల్లన్న, శివమూర్తి,పిక్కిలి నాగేశ్వరరావు,ఇనాయతుల్లా, శ్రీరాములు,శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.