ఆక్యుప్రెషర్ ఆక్యూపంక్చర్ గుర్తింపుకు కృషి …ఎమ్మెల్యే
1 min read
పెనమలూరు , న్యూస్ నేడు : నా నియోజకవర్గంలో నిర్వహించబడుతున్న ఆక్యుప్రెషర్ ఆక్యూపంక్చర్ వైద్యాన్ని కేంద్ర ప్రభుత్వ గుర్తింపు కొరకు మాజీ లోక్ సభ సభ్యుడు కొనకళ్ళ నారాయణతో కలిసి కృషి చేసినట్లు తెలిపారు.10 సంవత్సరాల కాలం పట్టిన వెన్నంటి ఉండి,నిర్విరామంగా మా సహకారం పొంది కేంద్ర ప్రభుత్వ గుర్తింపుకు ఈ ప్రాంతంలో వైద్య వృద్ధి చెందటానికి పనిచేసిన మాకాల సత్యనారాయణ ను అభినందిస్తున్నాను అని తెలిపారు. అంతర్జాతీయ యోగ దినోత్సవాలలో భాగంగా మోడీ ఫిట్నెస్ మంత్ర అవగాహన బ్రోచర్ను ఆవిష్కరించి,తన సహకారం అందిస్తానని తెలిపారు.యోగశక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ మాట్లాడుతూ పెనమలూరు ఎమ్మెల్యే బోడు బోడే ప్రసాద్ , మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ ,అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్ర బాబు అందించిన సహకారమే ఈనాడు కేంద్ర ప్రభుత్వం ఆక్యూపంక్చర్ ను ప్రత్యేక విభాగ చికిత్సగా గుర్తింపు రావడానికి కారణమని అలా సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.అలాగే 20 25 అంతర్జాతీయ యోగా దినోత్సవం జయప్రదం చేయటానికి సహకారం అందిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు.