నేరనివారనే లక్ష్యంగా పోలీసు అదికారులకు పనిచేయాలి : జిల్లా ఎస్పీ
1 min readనంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా IPS నంద్యాల జిల్లాలో నేరానివారనే లక్షంగా విజిబుల్ పోలిసింగ్,ఎన్ఫోస్మెంట్ పనులు జరగాలని ఆదేశాలమేరకు నంద్యాల జిల్లాలో అన్నీ పోలీసు స్టేషన్ పరీదులలో పోలీసు అదికారులు మట్కా,జూదము,అక్రమ మధ్యం,ఇసుక ,డ్రంకన్ & డ్రైవ్,రోడ్డు ప్రమాదాల నివారణకు మోటార్ విహికల్ ఆక్ట్ ను కట్టుదిట్టంగా అమలు చెయ్యడం, రాత్రి గస్తిని కట్టుదిట్టంగా అమలు చేయడం ,నేరస్తులపై నిఘా ఉంచడం, లాడ్జిలు క్రమం తప్పకుండా తనిఖీ చేయడం మొదలగు వాటిని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా జిల్లాలో నంద్యాల జిల్లాలోని అన్నీ పోలీసు స్టేషన్ పరిధిలలో గల అదికారులు వారి సిబ్బంది సహాయంతో డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు చేపట్టగా మొత్తం 09 కేసులు నమోదు కావడం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగా 68 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేయడం జరిగింది. జిల్లాలో మోటార్ వెహికల్ చట్టం అమలు చేసి 212 కేసులు నమోదు చేసి 63,120/-రూపాయలు జరిమాన విధించడం జరిగింది.జిల్లా అడిషనల్ ఎస్పీ పర్యవేక్షణలో SEB అదికారుల సివిల్ పోలీస్ అధికారుల ఆద్వర్యంలో అక్రమ మద్యంపై దాడులుచేసి 11 DPL కేసులలో నాటు సారాయి కేసులు నమోదు చేసి 80 లీటర్లు స్వాదినం చేసుకోవడంతోపాటు 94 (90ml) మధ్యం బాటిల్లు స్వాదినం చేసుకోవడం జరిగింది. జిల్లాలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై 05 కేసులు నమోదు చేసి 05 వాహనాలను సీజ్ చేసి సుమారు 34 టన్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీమాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత,ట్రాఫిక్ నిబందనలు పాటించాలని,ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలో పాల్గొన్న అటువంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని,చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచడం జరిగింది అని తెలియాయజేశారు.