తెలంగాణ ప్రభుత్వానికి మావోయిస్టుల లేఖ !
1 min readపల్లెవెలుగు వెబ్ : తెలంగాణ ప్రభుత్వానికి మావోయిస్టులు లేఖ రాశారు. స్టాన్ స్వామి హత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని మావోయిస్టు పార్టీ ప్రభుత్వానికి లేఖ రాసింది. స్టాన్ స్వామి మృతి పట్ల తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేసింది. బీమాకోరేగావ్ కేసులో నిందితులుగా ఉన్న వారిని భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అంగవైకల్యంతో బాధపడుతున్న ప్రొఫెసర్ సాయిబాబాను అక్రమకేసులు పెట్టి జైలు పాలు చేశారని లేఖలో పేర్కొన్నారు. రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని లేఖలో డిమాండ్ చేశారు.