స్వర్ణ పంచాయతీకి సహకరించండి : ఇఓఆర్డీ శివకుమార్ గౌడ్
1 min read
ప్యాపిలి, న్యూస్ నేడు: స్వర్ణ పంచాయతీ అందులో భాగంగా ప్యాపిలి పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న గృహాల విస్తీర్ణం మరియు యజమాని ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ సేకరిస్తున్నామని వాటిని ఆన్లైన్ చేస్తున్నామని ఇఓఆర్డీ శివకుమార్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మే నెల మొదట నుండిఈ నేల చివరివరకు మా పంచాయతీ కార్యాలయం సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని వారికి పట్టణ, గ్రామీణ ప్రజలు సహకరించాలని కోరడమైనది. ఇలా చేయడం వలన ప్రజలు తమ ఇంటి పనులు, కొళాయి పనులను ఆన్లైన్లోనే చెల్లించుకోవచ్చని తెలిపారు. ఇంతవరకు మాన్యువల్ లో ఉన్న ఇంటి పన్ను కొళాయి, పనులు పెండింగ్ ఉన్నవారు తక్షణమే చెల్లించి రసీదు పొంది ,తమ సిబ్బందికి సహకరించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.