సుప్రీం కోర్టు తీర్పుతో.. మాదిగలకు న్యాయం..
1 min readచీఫ్ జస్టిస్ చంద్ర చూడు నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల కు కృతజ్ఞతలు..
- ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచపూడి సుందర్ రాజు
కర్నూలు, పల్లెవెలుగు:మాదిగలు, మాదిగ ఉపకులాలకు సుప్రీంకోర్టు న్యాయం చేసిందని ఎమ్మార్పీఎస్ రాచపూడి సుందర్ రాజు జిల్లా ప్రధాన కార్యదర్శి హర్షం వ్యక్తం చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 30 ఏళ్ల పోరాటం ఫలించిందని వర్గీకరణ మాదిగలకు అండగా ఉండారని వారికి యావత్తు భారత దేశంలో ఉన్నటువంటి మాదిగలంతా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. వర్గీకరణ కోసం పోరాడి అమరులైన వారికి ఈ విజయం అంకితం చేస్తున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా పోరాడిన ప్రతి మాదిగ బిడ్డకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎమ్మార్పీఎస్ నాయకులు శ్రీ గద్ద రాజశేఖర్ దయ్యాల ఏసన్న కల్లూరు అంజి డేవిడ్ పంచలింగాల స్టాంటన్ పురం మాదిగలు పాల్గొన్నారు.