చైతూ..బాలీవుడ్‌కు ఎంట్రీ..
1 min readసినిమా డెస్క్ : మాస్ కంటే క్లాస్ చిత్రాలకే ఎక్కువ మెప్పించే నాగ చైతన్య ఇప్పుడు బాలీవుడ్ లో సీరియస్ ఎంట్రీ ఇస్తున్నాడట. తన స్పెషల్ ఎంట్రీకి అంతా సిద్ధమైంది. ఆమీర్ ఖాన్ నటిస్తున్న ‘లాల్ సింగ్ చద్ధా’లో ఓ కీలక పాత్రలో కనిపించ నున్నాడు చైతూ. ఇది హాలీవుడ్ క్లాసిక్ ‘ఫారెస్ట్ గంప్’కి రీమేక్. దర్శకుడు అద్వైత్ చందన్. ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్లో ఎప్పుడో జాయిన్ అవ్వాల్సిన చైతూ కోవిడ్ కారణంగా ఇప్పటివరకు సెట్‌కి వెళ్లలేకపోయాడు. లడఖ్‌లో ప్లాన్ చేసిన షూటింగ్ ఇప్పటికి రెండు సార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు నిన్న బాలీవుడ్ మూవీ సెట్లో అడుగుపెట్టాడు చైతు. లడఖ్‌లో జరిగే ఈ ఫైనల్ షెడ్యూల్లో కార్గిల్ వార్కి సంబంధించిన యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తు న్నారు. ఇందులో చైతూ ఆర్మీ ఆఫీసర్‌గా, ఆమీర్‌కి ఫ్రెండ్‌గా కనిపించబో తున్నాడట. ఈ పాత్రకోసం నాగచైతన్య స్పెషల్ ట్రైనింగ్ తీసుకుని మేకోవర్ కూడా అయ్యాడు. దాదాపు ఇరవై రోజులపాటు చైతూ ఈ షూట్లో పాల్గొన నున్నట్టు తెలుస్తోంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’మూవీ చేస్తున్న చైతూ వీలైనంత త్వరగా దీన్ని కూడా పూర్తిచేయాలనుకుంటున్నాడు. కొన్నిరో జులు మాత్రమే ఈ మూవీ షూట్ బ్యాలెన్స్ ఉంది. అలాగే తండ్రి నాగార్జునతో కలిసి ‘బంగార్రాజు’ మూవీ చేయాల్సి ఉంది. దీంతోపాటు కిశోర్ తిరుమలతో ఓ మూవీకి కమిట్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు కూడా సెట్స్‌కి వెళ్లనుందట. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయిపల్లవితో కలిసి నటించిన ‘లవ్ స్టోరీ’ రిలీజ్‌కి రెడీగా ఉంది.