జొమాటోలో.. పెట్టుబడి పెట్టాలంటే ఇలా చేయండి
1 min readపల్లెవెలుగు వెబ్ : ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో.. త్వరలో పబ్లిక్ ఇష్యూకి రాబోతోంది. అంటే.. జొమాటో స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవుతుంది. అప్పుడు మనం జొమాటో షేర్లు కొనుక్కుని.. జొమాటో కంపెనీలు భాగస్వామి అవ్వొచ్చు. మనం షేర్లు కొనుక్కోవాలంటే.. ఏదైన ఒక ఆన్ లైన్ బ్రోకరేజ్ కంపెనీ నుంచి మనకు డీ మ్యాట్ అకౌంట్ ఉండాలి. ఆ డీ మ్యాట్ అకౌంట్ లో మన షేర్లు భద్రపరచబడి ఉంటాయి. మనం అమ్మాలని అనుకున్నప్పుడు .. ఆ షేర్లను అమ్మవచ్చు. జొమాటో పబ్లిక్ ఇష్యూ ఈనెల 14న ప్రారంభమై.. 16న ముగియనుంది. ఈ పబ్లిక్ ఇష్యూలో జొమాటో షేర్లు విక్రయించే ధర 72 నుంచి 76 మధ్య ఉంటుంది. ఈ ఇష్యూ ద్వార జొమాటో 9,375 కోట్లు సమీకరించాలని అనుకుంటోంది. ఐపీవోలో భాగంగా 9000 కోట్ల కొత్త షేర్లను జొమాటో జారీ చేయనుంది. ఇన్ఫో ఎడ్జ్ సంస్థ.. తనకున్న 375 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వార అమ్మనుంది.