PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అత్యంత లోతైన స్మిమ్మింగ్ ఫూల్..ఎక్కడో తెలుసా ?

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : దుబాయ్ ప్రపంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్ ఫూల్ ప్రారంభించింది. డీప్ డైవ్ దుబాయ్ పేరుతో ఈ స్విమ్మింగ్ పూల్ ప్రారంభించింది. ఈ స్విమ్మింగ్ పూల్ గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కింది. నాడ్ అల్ ష‌బా ప్రాంతంలో ఈ స్విమ్మింగ్ పూల్ ఏర్పాటుచేశారు. దుబాయ్ యువ‌రాజు హ‌మ్ దాన్ బిన్ మ‌హ్మ‌ద్ స్విమ్మింగ్ పూల్ ప్రారంభించారు. 60 మీట‌ర్ల లోతున్న ప్రపంచంలోనే లోతైన డీప్ డైవ్ దుబాయ్ స్విమ్మింగ్ పూల్ మీ కోసం ఎదురుచూస్తోందంటూ ట్విట్టర్ దుబాయ్ యువ‌రాజు ట్వీట్ చేశారు. డైవింగ్ లో శిక్షణ తీసుకునే వారి కోసం, లోతట్టు ప్రాంతాల్లో డైవింగ్ చేసే ఆస‌క్తి గ‌ల‌వారి కోసం ఈ స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేశారు. 56 కెమెరాలు డైవింగ్ చేసే వారిని నిరంత‌రం ప‌ర్యవేక్షిస్తుంటాయి. ఇందులో నీటిని 6 గంట‌లకు ఒక‌సారి శుద్ధి చేస్తారు. ఈ పూల్ నింప‌డానికి 1.4 కోట్ల అవ‌స‌రం అవుతుంది. నాసా అభివృద్ధి చేసిన అధునాత‌న నీటి వ‌డ‌పోత సాంకేతిక‌త‌ను ఈ నీటి శుద్ధి ప్రక్రియ‌లో ఉప‌యోగిస్తారు.


About Author