అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణా పై 5కే రన్
1 min read

ఉదయం 6 గం కు వట్లూరు సి ఆర్ ఆర్ మహిళా కళాశాల నుండి ఇండోర్ స్టేడియం వరకు
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : జిల్లా కలెక్టర్ కలెక్టర్ కె వెట్రీ సెల్వి ఆదేశలమేరకు నాషా ముక్త్ భారత్ అభియాన్ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక అవగాహన కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి 01.06.2025 తేదిన ఆదివారం ఉదయం గం.6.30 ని.లకు సర్.సి.ఆర్.రెడ్ది మహిళా కళాశాల,వట్లూరు నుండి కలెక్టరేట్,ఇండోర్ స్టేడియం వరకు 5కే రన్ వాక్తాన్ కార్యక్రమము నిర్వహించబడుచున్నది. కావున, సదరు కార్యక్రమమునకు నగరంలోని ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తారని నగరపాలక సంస్థ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.

