NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మానవత్వంతో ఆపన్న హస్తం…

1 min read

అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న వ్యక్తికి ఆర్థిక సహాయం అందించిన నేతలు

న్యూస్ నేడు హొళగుంద:  ఇంకా మిగిలి ఉందంటూ ఆపదలో ఉన్న వారికి… ఇబ్బందుల్లో ఉన్నవారికి… అనారోగ్యంతో బాధపడుతున్న వారికి… తమకు ఉన్నదాంట్లో… ఇతరులు అందించే దాతృత్వంతో ఎంతోకొంత సహాయం చేస్తూ ఆర్థికంగా అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. హొళగుంద మండలం హొళగుంద గ్రామానికి చెందిన బోయ నాగప్ప  ఫైల్స్ వ్యాధితో బాధపడుతూ సరైన అవగాహన లేక వ్యాధి చికిత్స కోసం దాదాపుగా రెండు లక్షల రూపాయలు  ఖర్చులు పెట్టుకోవడం తో ఆర్థికంగా చితికిపోయాడు. వ్యాధి నయం కాకపోవడం  ప్రతిరోజు కూలికి పోతే కానీ జీవనం జరగని పరిస్థితులలో చికిత్స కోసం చేసిన అప్పులతో కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండడం తో తన స్నేహితుడైన ఎం ఆర్ పి ఎస్ నాయకుడు కొలిమి ముత్తయ్యతో తన బాధను పంచుకున్నాడు. తన స్నేహితుడు వ్యాధితో బాధపడుతూ  పని కూడా చేసుకో లేకుండా  ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండడంతో అదే విషయాన్ని ఎమ్మార్పీఎస్ నాయకుడు ఆదోని డివిజన్ అధ్యక్షుడు  పంచగుండగ వెంకటేష్ కు తెలిపి ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలని  కోరాడు. సాటి స్నేహితుని కుటుంబం ఆర్థికంగా చితికిపోయి  ఇబ్బందులు పడుతుండడంతో  మండలంలోని ప్రజా సేవకుడు ఎల్లార్తి మల్లికార్జున సోదరుడు వాల్మీకి యువ నాయకుడు లక్ష్మీకాంత్, ఎమ్మార్పీఎస్ వందవాగిలి గోవిందు, ఎమ్మార్పీఎస్ ఆదోని డివిజన్ ఉపాధ్యక్షుడు ఎల్లార్తి మహేష్  బిల్ కలెక్టర్ కోగిల తోట నాగరాజు  వాల్మీకి యువ నాయకుడు బోయ శ్రీనివాసులు, గజ్జహల్లి రఘు  ఇతర ఎమ్మార్పీఎస్ నాయకుల సహకారంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న బోయ నాగప్ప కుటుంబానికి  పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని  అందించారు. తన పరిస్థితిని గమనించి  మానవత్వంతో ఆలోచించి తనకు ఆర్థికంగా సహాయం చేసి అండగా నిలబడిన ఎమ్మార్పీఎస్ నాయకులు వాల్మీకి సోదరులకు బోయ నాగప్ప కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా యువ నాయకుడు వాల్మీకి లక్ష్మీకాంత్ అనారోగ్య సమస్యలతో ఆర్థికంగా ఇబ్బందులు పడే వారికి  తనవంతుగా  తగిన సహాయాన్ని అందించేందుకు  సహకరిస్తానని తెలిపాడు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు  సినిమా మంగన్న, కొలిమి ముత్తయ్య, కోగిల తోట విరుపాక్షి, మార్లమడికి లంకెప్ప , సిద్దయ్య స్వామి, డ్రైవర్ మల్లికార్జున, రుతి, మృత్యుంజయ, కిషోర్, రాజప్ప, నగేష్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author