మూడు జిల్లాల్లో అధికంగా కరోన..ఎందుకని ప్రశ్నించిన హైకోర్టు !
1 min readపల్లెవెలుగు వెబ్: ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో .. మిగిలిన జిల్లాలతో పోలిస్తే కరోన పాజిటివిటి శాతం ఎక్కువగా ఎందుకు ఉందో కారణాలు అన్వేషించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోన కట్టడికి సూక్ష్మ నిర్వహణ చర్యలు తీసుకోవాలని సూచించింది. వ్యాప్తికి కారణమవుతున్న ప్రాంతాలను కంటైన్ మెంట్ జోన్లుగా ప్రకటించాలని హైకోర్టు స్పష్టం చేసింది. 15 రోజులుగా జిల్లాల వారీగా నమోదవుతున్న కేసుల సంఖ్య ఎంత ?. కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో ఎలాంటి శ్రద్ధ తీసుకున్నారు ? లాంటి అంశాలతో వివరాలు కోర్టు ముందు ఉంచాలని ప్రభుత్వాన్నికి హైకోర్టు తెలిపింది. జస్టిస్ ఏకే. గోస్వామి, జస్టిస్ ఎన్. జయసూర్య నేతృత్వంలోని ధర్మాసనం మేరకు శుక్రవారం ఆదేశాలిచ్చింది.