లోక్ అదాలత్ లో 106 కేసులు పరిష్కారం
1 min readపల్లెవెలుగువెబ్, రాయచోటి: లోక్ అదాలత్ కార్యక్రమంలో భాగంగా శనివారం రాయచోటి జిల్లా ఐదవ అదనపు జడ్జి కోర్టులో 106 కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా 5 వ అదనపు జడ్జి లక్ష్మి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఫాతిమా, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి హారిక లు కోర్టు పరిధిలోని అన్ని మండలాల నుండి వచ్చిన కక్షిదారు లను ఆన్ లైన్, జూమ్ యాప్ ద్వారా 73 క్రిమినల్ కేసులు,15 ప్రమాదపు కేసులు,5 భూ తగాదా కేసులను విచారించి రాజీ మార్గం ద్వారా పరిష్కరించి రూ.1 కోటి 23 లక్షల 2 వేలు జరిమానా విధించడంతో పాటు చెల్లింపులు చేపట్టారు.ఈ కార్యక్రమంలో న్యాయవాదులు,పోలీసులు,కోర్టు సిబ్బంది,కక్షిదారులు పాల్గొన్నారు.