సీమ నీటిని .. తెలంగాణ తోడేస్తుంటే చోద్యం చూస్తున్నారు !
1 min readపల్లెవెలుగు వెబ్ : రాయలసీమకు రావాల్సిన శ్రీశైలం నీటిని తెలంగాణ తోడేస్తుంటే.. సీఎం జగన్ చేతులు ముడుచుకుని చోద్యం చూస్తున్నారని తెదేపా నేత సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆక్షేపించారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదం పరిష్కరించడంలో జగన్ విఫలమయ్యారని విమర్శించారు. గతంలో మిఠాయిలు తినిపించుకున్న సీఎంలు.. ఇప్పుడు కూర్చుని సామరస్యపూర్వకంగా సమస్య ఎందుకు పరిష్కరించుకోవడంలేదని ప్రశ్నించారు. తక్షణమే ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి కేంద్ర జలశక్తి మంత్రి తో చర్చించాలని డిమాండ్ చేశారు. తరచూ కేసుల మాఫీ కోసం మోదీ, అమిత్ షా చుట్టూ తిరిగే సీఎం.. జలవివాదం పరిష్కారానికి ఎందుకు వెళ్లడంలేదని విమర్శించారు.