ప్రజలకు హెచ్ఐవి/ఎయిడ్స్ పై అవగాహన..
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని బ్రాహ్మణకొట్కూరు లో ఎయిడ్స్ నియంత్రణ మండలి ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా ఎయిడ్స్ నివారణ అన్మరియు నియంత్రణ విభాగం సహకారం తో చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ ఆద్వర్యంలో బుధవారం గ్రామంలో హెచ్ఐవి/ఎయిడ్స్ మరియు సుఖ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పి.నాగరాజు,డీ ఆర్పి మాట్లాడుతూ హెచ్.ఐ.వి వ్యాధి పట్ల వలస కూలీల మరియు హమాలీ వర్కర్స్ కు హెచ్ఐవి పట్ల అవగాహన కలిగి ఉండడం వల్ల హెచ్.ఐ.వి కి గురికాకుండా చూసుకోవచ్చని చికిత్స కన్నా నివారణ మంచిదని తెలిపారు. హెచ్.ఐ.వి కేవలం అరక్షిత లైంగిక సంపర్కాలు,హెచ్.ఐ.వి ఉన్న గర్భిణీ నుండి పుట్టబోయే బిడ్డకు,హెచ్ఐవితో కలుషితమైన సూదులు సిరంజీలు పరీక్షింపబడని రక్తము ద్వారా మాత్రమే సంక్రమించే అవకాశం ఉందని తెలిపారు.ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెచ్.ఐ.వి పరీక్షలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని అలాగే పరీక్షలు చేయించుకున్న వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. మాట్లడుతూ హెచ్.ఐ.వి. ఉంది అని నిర్ధారణ అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏఆర్టి కేంద్రాలు,లింక్ ఏఆర్టి కేంద్రాల ద్వారా ఉచితంగా మందులు అందుబాటులో ఉన్నాయని మందులు వాడుతూ వైద్యుల సలహాలు పాటించినట్లయితే ఎటువంటి ఆరోగ్య పరమైన ఇబ్బందులు లేకుండా జీవితం కొనసాగించవచ్చని తెలియచేశారు.వ్యాధి ఉందనే కారణంతో వివక్ష చూపకూడదని అది హెచ్.ఐ.వి./ఎయిడ్స్ చట్టం- 2017 ప్రకారం శిక్షార్హమైన నేరమని తెలియచేశారు. హెచ్ఐవి పట్ల ఎటువంటి సందేహాలు/అనుమానాలు ఉన్నా జాతీయ హెల్ప్ లైన్ 1097 కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని అన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆగస్టు 12 నుండి అక్టోబర్ 12 వరకు 200 గ్రామాల్లో అవగహన సదస్సులు ఉన్నాయని యువత, మహిళలు,పొదుపు సంఘా లు,కార్మికులు గ్రామా ప్రజలను భాగస్వాములు చెయ్యాలని వారు చెప్పారు.ఈ కార్యక్రమంలో బుజ్జమ్మ లింక్ వర్కర్,ఏఎన్ఎమ్ లు, అంగన్వాడీ మరియు ఆశా కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.