సస్యరక్షణ పై పెదకడిమి గ్రామంలో రైతులకు అవగాహన కార్యక్రమం
1 min readవరి పంట పై ఆశించే పురుగులు, వాటి నివారణ తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వ్యవసాయ శాస్త్రవేత్తలు డా: పణి కుమార్, రమణ, నాగేంద్రబాబు పంట పొలాలను పరిశీలించారు
ఈ పంట నమోదు వల్ల రైతులకు పలు ప్రయోజనాలు
పాల్గొన్న మండల వ్యవసాయ అధికారి యం.ప్రియాంక
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : వరి పంట పై ఆశించే పురుగులు తెగుళ్లు వాటి నివారణ పై రైతులు తీసుకోవాల్సిన సస్యరక్షణ గురించి వ్యవసాయ శాఖాది కారులు బుధవారం పెదవేగి మండలం పెడకడిమి గ్రామం లో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు,ఈ కార్యక్రమం లో ఏలూరు ఏరువాక కేంద్రం నుండి వ్యవసాయ శాస్త్ర వేత్తలు డాక్టర్ ఫణికుమార్,డాక్టర్ రమణ,డాక్టర్ నాగేంద్ర బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు గ్రామ రైతులు తో కలిసి వరి పంట పొలాలను పరిశీలించారు,పంటల పై ప్రస్తుత సీజన్ లో ఆశించే పురుగులు .అగ్గి తెగుళ్లు.నాచు తెగుళ్లు తెల్ల దోమ .రసం పీల్చే పురుగులు వాటి వల్ల ఏర్పడే పంట నష్టాలను రైతులకు వివరించారు,వరి పంట పై ఆశించే వివిధ రకాల తెగుళ్లు నివారణకు తీసుకోవాల్సిన సస్య రక్షణ చర్యల పై గ్రామం లో ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమం లో రైతులకు శాస్త్ర వేత్తలు వివరించారు, వ్యవసాయ శాఖ రైతుల సౌకర్యార్థం కోసం ఏర్పాటు చేసిన ఈ పంట నమోదు వల్ల కలిగే ప్రయోజనాల ను జిల్లా వ్యవసాయాది కార్యాలయ ఏ డి ఏ లు శైలజ, మహిత రైతులకు వివరించారు. ప్రస్తుతం ఈ పంట యాప్ లో ఎంతమంది రైతులు తమ పంటల వివరాలను నమోదు చేసుకున్నారు,ఇప్పటి వరకు ఈ పంట యాప్ లో ఎన్ని హెక్టారుల పంట నమోదైంది.ఇంకా ఎంత చేయాల్సి ఉంది,ఈ పంట యాప్ లో పంటల నమోదు కార్యక్రమం ఎలా జరుగుతుంది ఆ నే వివరాలను వ్యవసాయ ఉద్యానవన పంటల శాఖాధికారుల ను అడిగి తెలుసుకున్నారు,ఈ కార్యక్రమం లో పెదవేగి మండల వ్యవసాయాధికారి ప్రియాంక.గ్రామ సర్పంచ్.ఎం పి టి సి లతో బాటు వ్యవసాయ.ఉద్యాన శాఖల సహాయకులు రైతులు పాల్గొన్నారు.