ప్రాథమిక పాఠశాల ఆవరణంలో ప్లాంట్ ఫర్ మదర్ కార్యక్రమం
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : పెద్దహ్యట మండల ప్రాథమిక పాఠశాల (M.P.P) ప్రధానోపాధ్యాయుడు విద్య కమిటీ చైర్మన్ గ్రామస్తుల ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణం చుట్టూ మొక్కలు నాటడం జరిగింది._పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్క భారతీయుడు ఒక మొక్క నాటి మన దేశ పర్యావరణ పరిరక్షణ మరింత మెరుగుపరుచుకుందాం. మనం మనుషులు పీల్చుకునే ఆక్సిజన్ మనకు ఉత్పత్తి చేసి మనం పీల్చుకొని వదిలేసిన కార్బన్ ఆక్సైడ్ ను మళ్లీ చెట్లు పీల్చుకొని మనుషులకు కావలసిన ఆక్సిజన్ ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది కాబట్టి మనసులు ప్రాణాలతో ఉండాలన్న ప్రతి ఒక్క భారతీయుడు ఒక మొక్కను నాటి దేశ పర్యావరణ పరిరక్షణ పచ్చదనంగా చేసుకుందాం.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అంజు నాయక్ పాఠశాల విద్య కమిటీ చైర్మన్ రాము వార్త విలేఖరి విరుపాక్షి AISF జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరంగ టిడిపి యువ నాయకులు సోమశేఖర్ గౌడ్ కట్టే వీరేష్ రామలింగప్ప గ్రామస్తులు మాజీ విద్యా కమిటీ చైర్మన్ గోపాల్ పాఠశాల విద్య కమిటీ వైస్ చైర్మన్ భర్త హెచ్.వీరభద్ర నాగేంద్ర సుంకయ్య బంగారప్ప వీరేష్ మారేష్ తమన్నా విరూపాక్షి విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.