ఆదాని మెగా కుంభకోణంపై దర్యాప్తు జరపాలి… కాంగ్రెస్ పార్టీ డిమాండ్
1 min readసెబీ చీఫ్ రాజీనామా చేయాలని డిమాండ్
ఆదానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యడ్జీల తో నిరసన
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు పట్టణంలో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ( ఏఐసీసీ ) కమిటీ దేశవ్యాప్త నిరసన పిలుపు మేరకు శుక్రవారం స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలో సోమప్ప సర్కిల్ నందు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కసిం వలి, విద్యార్థి విభాగం ఎం ఎస్ యు వై. జిల్లా అధ్యక్షులు వీరేష్ యాదవ్,ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ఆదానికి ,సెబీ చీఫ్ కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఆదాని మెగా కుంభకోణంపై సమగ్ర విచారణ జరపాలని, ఎస్ సి బి ఐ. చైర్ పర్సన్ అక్రమాలపై దర్యాప్తునకు జాయింట్ పార్లమెంటు కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ పార్టీ గా డిమాండ్ చేస్తున్నామనితెలిపారు.సెబీ చీఫ్ మాధురి పూరి బుచ్ తో వ్యాపారవేతతో వ్యాపార సంబంధాలు ఉన్నట్లు హిండెన్ బర్గ్ ఆరోపించిన దరిమిలా సెబీ చీఫ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.బిజెపి ప్రభుత్వం బడ వ్యాపారులకు అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ బీజేపీకేంద్ర ప్రభుత్వ హయాంలో అనేక కుంభకోణంలు జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. దేశంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ , ఎన్ ఎస్ యు వై. బనవాసి జైపాల్ లోకేష్ , రఫీక్ ,నబి రసూల్, ఇమ్రాన్ అక్బర్ ఇబ్రహీం,కుమార్ ,అజయ్ తదితరులు పాల్గొన్నారు.