PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చర్చ వేదికగా గ్రమసభ..

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద: హోల ళగుందా మేజర్ గ్రామపంచాయతీ నందు గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ సభలో గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి  గ్రామసభ లో చర్చించడం  జరిగింది వార్డ్  లా వారీగా వార్డు మెంబర్లు కొన్ని సమస్యలను, DLDO, సర్పంచ్ మరియు కార్యదర్శి  లకు అర్జీ ఇవ్వడం జరిగింది అందులో  ముఖ్యంగా 8 వ వార్డు 9వ వార్డు ఈ బీ సీ కాలనీలో ఒకటవ లైన్ నుండి సిద్దేశ్వర గుడి పక్కన వరకు 7  అడ్డం లైన్లకు సిసి రోడ్లు మరియు కొన్నిచోట్ల డ్రైనేజ్ లేనందున చాలా ఇబ్బందిగా ఉన్నందువలన పరిష్కారం కోసం అర్జీ పెట్టడం జరిగింది .కొన్ని రోజుల క్రితం ఈ బీసీ కాలనీలో 12 కరెంటు కొత్త స్తంభాలు పాతడం జరిగింది, ఆ స్తంభాలకు కరెంటు తీగలు మరియు వీధి దీపాలను బిగించాలని అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ బీ సీ కాలనీ లో గత 35 సంవత్సరాల క్రితం మెయిన్ లైన్లకు లాగిన విద్యుత్ తీగలు నాసిరకంగా మరాయి, అందువలన  లో వోల్టేజ్ , షార్ట్ సర్క్యూట్ అవ్వడం జరుగుతుంది. దీనికీ కండక్టర్ లైన్ లాగాలని అలాగే కొత్త ట్రాన్స్ఫార్మర్ బిగించాలని కోరడం జరిగింది.ఊరి  పెద్ద డ్రైనేజ్ అయిన ముస్లిమ్స్ స్మశాన వాటిక పక్కనున్న డ్రైనేజ్  నిర్మాణం పూర్తి చేసి  మరియు ముస్లిమ్స్ స్మశాన వాటికకు పహరి గోడ నిర్మించాలని కోరడమైనది . LLC కెనాల్ నుంచి వచ్చే నీళ్లకు ఒక ఫిల్టర్ బెడ్ సరిపోకపోవడం వలనప్రజలకు రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని మరోక ఫిల్టర్ బెడ్ నిర్మించి కొల్లాయి లకు మంచి నీటిని సరఫరా చేయాలని  కోరడం జరిగింది. రాబోయే రోజుల్లో నీటి సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయని స్థానిక ఈద్గా కొండపైన వాటర్ ట్యాంక్ కట్టాలని ఆ ట్యాంక్ నుంచి శాలి కాలనీ, అయోధ్య నగర్, బస్టాండ్ ఏరియా, ఈ బీ సీ కాలనీ వరకు నీళ్లు సప్లై అవ్వచ్చని కొత్త ట్యాంక్  నిర్మించాలని కోరడం జరిగింది.మా ఊరు మారుమూల గ్రామమైన హొల్గొండ మండలంలో కొండలు ఎక్కువ ఉన్నందువలన రైతుల పొలాల్లో రాళ్లు తీపించే మార్గం  ఉపాధి హామీ పథకం కింద మంజూరు చేయించాలని కోరడం జరిగింది.  హోళగుందా మేజర్ గ్రామ పంచాయతీ ముందు వున్న కూరగాయల మార్కెట్ లో సీసీ రోడ్డు వేసి  నీటి ట్యాంక్ నిర్మించాలని కోరడం జరిగింది. స్థానిక EBC కాలనీ లాస్ట్ ఏరియాలో 20 గుడిసెలు వేసుకొని ప్రజలు పది సంవత్సరాల నుండి జీవనం సాగిస్తున్నారు వారికి ఒరిజినల్ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరడం జరిగింది.   అలాగే నాలుగో వార్డ్ లో సినప్పా బావి,మంకళ్ళమ గుడి ,దిడ్డి  కాలనీ లో కొన్ని రోజుల క్రితం 18 కరెంటు కొత్త స్తంభాలు బిగించడం జరిగింది వాటికి కరెంటు తీగలు మరియు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. ఒకటో వార్డు రెండో వార్డ్ మూడో వార్డు నాలుగో వార్డ్ లలో తాగే నీళ్లు నాలుగు రోజులకు ఒకసారి ఐదు రోజులకు వస్తున్నాయి దీనికి పరిష్కారం  ధిడ్డి కొండపై ఇంకో ట్యాంక్ కట్టాలని అర్జీలో కోరడం జరిగింది12.  6 వా వార్డు లో కొన్ని చోట్ల సిసి రోడ్లు వేయాలని , నీటి సమస్య పరిష్కరించాలని అర్జీ రూపంలో కోరడం జరిగింది. ఈ సమస్యలను విన్న అధికారులు వెంటనే సమస్యలు పరిష్కారం చేద్దాం అని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు  N. SUBAN  K.అబ్ధుల్ రెహ్మాన్  F. హమీద్. బాకడి శంకర్, నాయకులూ సలామ్ హబిబ్, హరున్ ,షఫీ పాల్గొన్నారు.

About Author