ఏలూరు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ఘనవిజయం
1 min read
లాయర్ల ఇబ్బందులు తొలగించేందుకు వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తా
అధ్యక్షులు కోనే సీతారామారావు
దూరప్రాంతాల నుంచి వచ్చే లాయర్లకు భోజన సదుపాయం ఏర్పాటుకి ప్రయత్నం
అధ్యక్ష ,కార్యదర్శుల కి ప్యానల్ కి పెద్ద ఎత్తున అభినందించిన లాయర్లు, జూనియర్ లాయర్లు,సిబ్బంది
ఏలూరుజిల్లా ప్రతినిధి ఏలూరు న్యూస్ నేడు: ఏలూరు బార్ అసోసియేషన్ కి నాడు జరిగిన ఎన్నికల్లో కొనే సీతారామారావు ప్యానల్ ఘన విజయం సాధించింది,బార్ అసోసియేషన్ ప్రసిడెంట్ గా కొనే సీతారామారావు ను ఎన్నికల అడ్ హాక్ కమిటీ శనివారం రాత్రి అధికారికం గా ప్రకటించింది,శుక్రవారం ఏలూరు బార్ అసోసియేషన్ కు జరిగిన ఎన్నికల్లో అబ్బినేని విజయ్ కుమార్,కొనే సీతారామారావు ప్యానల్ పోటీపడ్డాయి,ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు శనివారం అర్ధరాత్రి వరకు కొనసాగింది,చివరకు విజయం కొనే సీతారామరావు నే వరించింది. ,కౌంటింగ్ కూడా పూర్తి పోలీస్ బందోబస్త్ మధ్య సాగింది,కొనే సీతారామారావు ప్యానల్ విజయం సాధించడం తో కొనే వర్గీయులలో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి, కోనే సీతారామారావు 170 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ గా నిస్సంకర కృష్ణారావు 225 ఓట్లు అదేవిధంగా జనరల్ సెక్రటరీ నోముల రాముడు 150 ఓట్లు జాయింట్ సెక్రటరీ ఇబ్రహీం షరీఫ్ కు 90 ఓట్లు కోశాధికారి గండికోట సీతారామరాజుకు 159 ఓట్లు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా జీ విజయభాస్కర్ కు 32 ఓట్లు లైబ్రరీ సెక్రటరీ కే కృష్ణ కిషోర్ కు 50 కోట్లు అంతేకాకుండా లేడీ రిప్రజెంటేటివ్ గా ఈ కనకదుర్గ భవాని కి 8 ఓట్ల మెజార్టీతో మొత్తం మీద సీతారామారావు పానెల్ విజయం సాధించింది. ఈ సందర్భంగా శనివారం మధ్యాహ్నం సీతారామరావు బార్ అసోసియేషన్ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు కోనే సీతారామారావు ప్యానల్ బృందాన్ని అభినందించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు సీతారామరావు విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం లాయర్లకున్న ఇబ్బందులను తొలగించేందుకు వారి సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు. అంతేకాకుండా జిల్లా కోర్టు ప్రాంగణంలో అందరికీ టాయిలెట్ సౌకర్యం ఉండే విధంగా కృషి చేస్తానన్నారు. అంతేకాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చే లాయర్లకు భోజనం సదుపాయాలు కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తానన్నారు. జూనియర్ లాయర్లు కు ఏ సమస్య వచ్చినా వెంటనే తన దృష్టికి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వారి సమస్య పరిష్కారం అయ్యేంతవరకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. అదేవిధంగా సీరియల్ న్యాయవాదులు సలహాలు తీసుకొని బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తనకున్న పరిమితిలో కోర్టు ప్రాంగణంలోనూ జూనియర్ లాయర్లకు అందరికీ తగు న్యాయం చేసే విధంగా తన వంతు కృషి చేస్తానని అధ్యక్షులు కొనే సీతారామారావు తెలియజేశారు.