NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కె జి బి వి లో మాదిగ మహిళకు పని రక్షణ కల్పించండి 

1 min read

పి జి ఆర్ ఎస్ లో మాదిగ మహిళ రమాదేవి ఫిర్యాదు 

మహిళకు అండగా ఎం ఆర్ పి ఎస్ పంచగుండుగ వెంకటేష్ మాదిగ

న్యూస్ నేడు హొళగుంద:  హొళగుంద కేజీబీవీ పాఠశాలలో కాంట్రాక్ట్ ప్రాతిపదికపై  దినసరి కూలీతో  వాచ్ వుమెన్ గా పనిచేస్తున్న  తనకు ఉద్యోగ పనిరక్షణ కల్పించాలని కోరుతూ  హొళగుంద ఎస్ సి కాలనీకి చెందిన పెద్దింటి మాదిగ రమాదేవి  సోమవారం పీజిఆర్ఎస్ దరఖాస్తును  తాసిల్దార్ కు సమర్పించారు. ఈ సందర్భంగా ఆ మహిళ మాట్లాడుతూ  తాను దళిత సామాజిక వర్గం మాదిగ కులం కి చెందిన మహిళనని  గత మూడు సంవత్సరాలుగా పావు కేజీబీవీ హొళగుంద పాఠశాలలో వాచ్ వుమన్ గా పని చేస్తున్నానని తెలిపారు. గత విద్యా సంవత్సరంలో  ఏజెన్సీ ద్వారా బోధ నేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేయడానికి సర్వ శిక్ష అభియాన్  దరఖాస్తులను కోరగా తాను కూడా దరఖాస్తు చేసుకున్నానని  అయితే అప్పటి అర్హత ప్రమాణాల ప్రకారం  శైలజ అనే మహిళ  ఎంపికై  వాచ్ ఉమెన్ గా పనిచేయడానికి ఆసక్తి చూపక  విధులలో  చేరకపోవడంతో  ఖాళీగా ఉన్నటువంటి వాచ్ ఉమెన్ పోస్ట్ కు  తనను దినసరి వేతనంపై కొనసాగించారని తెలిపారు. అప్పటినుండి తానే  కేజీబీవీ పాఠశాలలో  వాచ్ వుమన్ గా పని చేస్తూ  ఎటువంటి రిమార్కులు లేక అధికారులు ఆదేశాలకు లోబడి పని చేస్తున్నానని  అయితే కొందరు తనపై అసూయతో  ఒత్తిడి చేస్తూ తనను ఉద్యోగం నుంచి తొలగించి  వేరే మహిళకు ఇప్పించాలని ప్రయత్నిస్తూ పాఠశాల అధికారులపై తనను తొలగించడానికి ఒత్తిడి తెస్తున్నారని  పేర్కొన్నారు. వారి ఒత్తిడితో  తనను విధులకు రావద్దని  పాఠశాల ప్రిన్సిపాల్ చెప్పారని  అయితే నోటిఫికేషన్ సమయంలో దరఖాస్తు కూడా చేయని జాను అనే మహిళ కోసం  దళిత కులానికి చెందిన తనను విదుల నుంచి తొలగించడం తన కడుపు కొట్టడం భావ్యం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ ఆదోని డివిజన్ ఎం ఆర్ పి ఎస్ అధ్యక్షులు వెంకటేష్ మాదిగ మాట్లాడుతూ   అన్యాయంగా దళిత మహిళను విడుదల  నుంచి తొలగిస్తే  పోరాటం చేస్తామని దళిత సామాజిక వర్గం మాదిగ కులానికి చెందిన  దళిత మహిళ పెద్దింటి మాదిగ రమాదేవికి  ఉద్యోగ పనిరక్షణను కల్పించాలని డిమాండ్ చేశారు.

About Author