నిరుద్యోగుల ఆందోళనకు మావోయిస్టుల మద్దతు !
1 min readపల్లెవెలుగు వెబ్ : రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ క్యాలెండర్ ను నిరసిస్తూ నిరుద్యోగుల ఆందోళనకు మావోయిస్టుల మద్దతు తెలిపారు. ఏపీ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ మావోయిస్టు విశాఖ తూర్పు డివిజన్ కార్యదర్శి అరుణ పేరిట ఆడియో టేపు విడుదలైంది. రాష్ట్ర ప్రభుత్వం బూటకపు సంస్కరణలు చేస్తోందని అరుణ విమర్శించారు. ఉద్యోగాలపై సీఎం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, కొత్త విద్యావిధానంతో 24వేల ప్రాథమిక పాఠశాలలు మూతపడతాయని ఆమె ఆరోపించారు. ప్రభుత్వ విధానాల వల్ల 37 వేల మంది ఉపాధ్యాయులు ఉద్యోగాలు కోల్పోతారని ఆడియో టేపులో అరుణ పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో వంద శాతం ఉద్యోగాలు గిరిజనులకే ఇవ్వాలని, ప్రభుత్వ విధానాలపై ఉద్యమించాలని మావోయిస్టు పార్టీ నాయకురాలు అరుణ అన్నారు.