కాల్షియం ఐరన్ ఎక్కువగా ఉండే పోషకాలు తీసుకోవాలి
1 min readఐసిడిఎస్ సూపర్వైజర్ గుర్రమ్మ
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : గర్భవతులు ,బాలింతలు కాల్షియం ఐరన్ ఎక్కువగా ఉంది పోషకాహారం తీసుకోవాలని, అలాగే నీటిని ఎక్కువ త్రాగాలని, మహిళలు చట్టాలపై కూడా అవగాహన కలిగి ఉండాలని అంగన్వాడి సూపర్వైజర్ గుర్రమ్మ తెలిపారు. పోషణ మాసోత్సవాల్లో భాగంగా బుధవారం చెన్నూరు సెక్టార్ సూపర్వైజర్ మూడో అంగన్వాడి కేంద్రం నందు సామాజిక వేడుక, పోషణ వేడుక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ మాట్లాడుతూ, ఆరు నెలలు పూర్తయినటువంటి పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం, అలాగే గర్భవతి లకు శ్రీమంతం నిర్వహించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా వారికి ఇమ్మునైజేషన్ ఏర్పాటు చేయడం జరిగినదని ఆమె తెలిపారు, ఈ కార్యక్రమానికి గర్భవతులు, బాలింతలు పెద్దలు హాజరు కావడం జరిగినదని తెలియజేశారు. ఇందులో పాల్గొన్న వారికి ఆహారం పట్ల, ఆరోగ్యం పట్ల, చట్టాల పట్ల అవగాహన కలిగించడం జరిగిందని ప్రతినెల హెచ్ బి పరీక్షలు చేయించుకోవాలని తెలియజేసినట్లు ఆమె తెలిపారు. గర్భవతులు, బాలింతలు హెచ్ బి లెవెల్ తగ్గకుండా చూసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు.క్యాల్షియం , ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని,ఆకుకూరలు తప్పనిసరిగా తినాలని .తగినన్ని నీళ్లు అంటే రోజుకి కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలని ఆమె తెలియజేశారు. అదేవిధంగా మహిళలకు చట్టాల గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మూడవ వార్డు, వార్డు ఐదవ వార్డు, లతోపాటు అంగన్వాడి కార్యకర్తలు షాహిదా, పద్మ ,మెహతాబ్, ఏఎన్ఎం జ్యోత్స్నా ఆశా కార్యకర్తలు షబానా ,అనసూయ, సచివాలయ సిబ్బంది పాల్గొనడం జరిగింది.