PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆయిల్ షాపును ప్రారంభించిన ఎమ్మెల్యే గౌరు చరిత

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని కేజీ రహదారి పోలీస్ స్టేషన్ ఎదురుగా మాష అల్లాహ్ ఆయిల్ షాపు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాణ్యం శాసనసభ్యులు గౌరు చరితా రెడ్డి మరియు నందికొట్కూరు టిడిపి నియోజకవర్గ సమన్వయకర్త గౌరు వెంకటరెడ్డి హాజరయ్యారు.మొల్ల మసాలా బాబు(మహబూబ్ బాష) మరియు ఈయన కుమారుడు  హబీబ్ ఆహ్వానం మేరకు గౌరు దంపతులు సోమవారం మధ్యాహ్నం ఆయిల్ షాపును వారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.తర్వాత మసాలా బాబు కుటుంబ సభ్యులు వారిని భారీ గజమాలతో సత్కరించారు. ముందుగా టపాకాయలు కాలుస్తూ పూల మాలలతో ముసాల బాబు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో టౌన్ క్లస్టర్ ఇంచార్జి మరియు రాష్ట్ర టీడీపీ లీగల్ సెల్ కార్యదర్శి లాయర్ జాకిర్ హుస్సేన్, టీడీపీ నియోజక వర్గ మైనారిటీ నాయకులు సౌదీ చాంద్,సత్తార్ మియ్య, వాహిద్,కాళాకర్,మోహన్, అప్సర్ బాష,అబ్దుల్లా,షఫీ, రాజు,శ్రీకాంత్ మరియు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *