భగభగమంటున్న చికెన్ ధరలు !
1 min readపల్లెవెలుగు వెబ్ : మాంసం ధరలు భారీగా పెరిగాయి. ఆషాడ మాసం, బోనాల జాతర జరిగే సమయం కావడంతో మాంసం డిమాండ్ భారీగా పెరిగింది. మటన్ ధరలు అధికంగా ఉండటంతో జనం చికెన్ వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో చికెన్ ధరలు కూడ ఆకాశాన్నంటుతున్నాయి. కిలో చికెన్ ధర ప్రస్తుతం 260 రూపాయలు పలుకుతోంది. గత వారంలో 180 రూపాయలు ఉన్న చికెన్ ధర.. ప్రస్తుతం 260 రూపాయలు ఉంది. కిలో నాటుకోడి ధర 600 నుంచి 700 పెరుగుతోంది. కరోన తర్వాత చికెన్ ధరలు పడిపోయినప్పటికీ.. గుడ్డు ధరలు మాత్రం పెరిగాయి. కరోన కేసులు తగ్గుతున్న క్రమంలో చికెన్ ధరలు పెరుగుతున్నాయి.