భూమి వైపు దూసుకొస్తున్న సౌర తుఫాన్ !
1 min readపల్లెవెలుగు వెబ్: శక్తివంతమైన సౌర తుఫాను భూమి వైపు దూసుకొస్తున్నట్టు నాసా ప్రకటించింది. దీని ప్రభావంతో సెల్ ఫోన్ సిగ్నళ్లు, జీపీఎస్ లాంటి సేవలకు ఆటంకం కలగనుంది. సూర్యుడి వాతావరణంలో నుంచి ఉద్భవించిన ఈ తుఫాన్ గంటకు 16 లక్షల కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తోంది. దాని వేగం మరింత పెరిగే అవకాశం ఉంది. సోమవారంలోపు అది భూగ్రహాన్ని తాకొచ్చని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. సౌర తుఫానుతో భూగోళపు బాహ్య వాతావరణం వేడెక్కే అవకాశం ఉంది. ఫలితంగా ఉపగ్రహాలపై ప్రభావం పడి జీపీఎస్, సెల్ ఫోన్ , శాటిలైట్ సిగ్నళ్లకు అంతరాయం ఏర్పడుతుంది.